YS Jagan : జగన్ తో శత్రుత్వం పెట్టుకునే ప్రసక్తే లేదు.. ఓపెన్ గా చెప్పేస్తోన్న బీజేపీ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : జగన్ తో శత్రుత్వం పెట్టుకునే ప్రసక్తే లేదు.. ఓపెన్ గా చెప్పేస్తోన్న బీజేపీ?

 Authored By kranthi | The Telugu News | Updated on :11 June 2023,12:00 pm

YS Jagan: ఏపీలో బీజేపీ పార్టీ రూటు ఎటు. బీజేపీ పార్టీ ఎటువైపు పయనించాలని భావిస్తోందో ఎవ్వరికీ క్లారిటీ రావడం లేదు. టీడీపీ, జనసేన పొత్తు అయితే కన్ఫమ్ అయినట్టు కానీ.. మరి బీజేపీ పరిస్థితి ఏంది. బీజేపీ ఎటు వైపు వెళ్తుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇప్పటికే చంద్రబాబు బీజేపీ మీద కర్చీఫ్ వేశారు. ఏపీలో మీరు టీడీపీతో జతకట్టాలని కేంద్రం దగ్గరికి వెళ్లి మరీ మంతనాలు జరిపారు. ఏపీలోని అధికార వైసీపీ పార్టీని ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించారు చంద్రబాబు. వైసీపీతో బీజేపీ విరోధం పెట్టుకోవాలని, టీడీపీతో దోస్తీ కుదుర్చుకోవాలని కేంద్రాన్ని కోరినా.. బీజేపీ మాత్రం జగన్ తో శత్రుత్వం పెట్టుకోవద్దనే భావిస్తుంది.

ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు విరోధించాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబుతో ఇటీవల జరిగిన భేటీ తర్వాతే బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేడీ నడ్డా ఇద్దరినీ కలిసినా ప్రయోజనం లేదు. వాళ్లతో చంద్రబాబు జరిపిన మంతనాలు పనికి వచ్చేలా లేవు. ఎందుకంటే.. బీజేపీకి అసలు చంద్రబాబుతో జతకట్టే ఉద్దేశమే లేదు. వైసీపీని వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు.

bjp party is not interested to have enmity with ysrcp

bjp party is not interested to have enmity with ysrcp

YS Jagan : జనసేన ఒత్తిడి మేరకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒత్తిడి మేరకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినట్టు తెలుస్తోంది. బీజేపీతో జనసేనకు పొత్తు ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా అంత వర్కవుట్ కాలేదు. టీడీపీ, జనసేన పొత్తు అయితే ఖాయం కానీ.. బీజేపీ వీళ్లతో కలిసే చాన్స్ అస్సలు లేదని తెలుస్తోంది. ఎందుకంటే.. టీడీపీతో కలిస్తే బీజేపీ వైసీపీని వ్యతిరేకించాలి. అందుకే.. వైసీపీని వ్యతిరేకించకూడదని భావించిన బీజేపీ.. టీడీపీతో జతకట్టకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు.. ఈ మధ్య వైసీపీకి ఫేవర్ గా ఉండేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం రూ.10,500 కోట్లు, పోలవరం కోసం రూ.12 వేల కోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇవన్నీ చూస్తుంటే బీజేపీ, వైసీపీకి మధ్య ఎంత అనుబంధం ఉందో తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది