YS Jagan : జగన్ పాలన మీద పురందరేశ్వరి మాటలు – మోదీ మనసులో మాటని బయటపెడుతున్నాయా?
YS Jagan : ప్రస్తుతం ఏపీలో అందరి చూపు వైసీపీ మీదనే ఉంది. దానికి కారణం.. వైసీపీ వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశాలు ఉండటం. మరోవైపు వైసీపీ.. కేంద్రంతో సన్నిహితంగా ఉంటోందని అందుకే పలు దర్యాప్తు సంస్థలు ఏపీ ప్రభుత్వం చెప్పినట్టు వింటున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ చేసేది ప్రతిపక్షాలు. దానికి కారణం.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఏపీ ప్రభుత్వం సీబీఐలో పావులు కదుపుతోందని అంటున్నారు.
ఇటువంటి సమయంలోనే బీజేపీ నాయకురాలు పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే.. వైసీపీకి ఆమె క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా ఉంది. పురందేశ్వరి ఏంటి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది అంటూ రాజకీయ విశ్లేషకులు షాకింగ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. సీబీఐ అనేది ఒకరి చేతుల్లో ఉండి చేసేది కాదు. అది స్వతంత్ర సంస్థ. దానిపై ఎవ్వరి ప్రభావం ఉండదు అంటూ ఆమె సర్టిఫికెట్ ఇచ్చేశారు.చిన్నమ్మ చెప్పేది నిజమేనా.. సీబీఐని వైసీపీ ఎలాంటి ప్రభావం చేయడం లేదా? సీబీఐని ఎవ్వరూ నియంత్రించడం లేదని.. సీబీఐ తన పని తాను చేసుకుంటూ పోతోందని చెప్పడం వెనుక అసలు గుట్టు ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.
YS Jagan : చిన్నమ్మ చెప్పేది నిజమేనా?
అంటే చిన్నమ్మ ఇన్ డైరెక్ట్ గా సీబీఐకి కాదు.. వైసీపీకి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా అర్థం వస్తోందంటున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా రాష్ట్రానికి రావాల్సినవే. అవి న్యాయబద్ధంగా రావాల్సినవి. నిధులు ఇవ్వాల్సినవి కాబట్టి ఇచ్చారు. అయినా మీడియా రెండు నాల్కల ధోరణి ప్రవర్తిస్తోంది. ఇస్తే.. ఇచ్చారని అంటారు.. లేకపోతే ఇవ్వలేదంటారు.. అంటూ చిన్నమ్మ గుస్సా అయ్యారు. ఇక.. టీడీపీ అధినేత చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ విషయం గురించి ప్రస్తావిస్తూ.. ఆయన్ను ఎవరైనా కలవొచ్చు.. పొత్తులు అనేవి కేంద్రం పరిధిలో ఉంటాయి అంటూ స్పష్టం చేశారు.