Boora Narsaiah Goud : మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు భారీ షాక్.. బూర నర్సయ్య గౌడ్ రాజీనామా.. షాక్ లో కేసీఆర్
Boora Narsaiah Goud : గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఒకటే చర్చ. టీఆర్ఎస్ పార్టీ నేత బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈయన మాజీ ఎంపీ కావడం, సీనియర్ నేత కావడంతో పాటు త్వరలో మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అంతా ఎదురు చూశారు. అందరూ ఊహించినట్టుగానే టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు బూర నర్సయ్య గౌడ్. టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు.
వెంటనే తన రాజీనామా లేఖను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు బూర పంపించారు. అంతే కాదు.. ప్రభుత్వ నిర్ణయాలు, పాలసీలపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. తనకు జరిగిన అవమానాలను లేఖ రూపంలో కేసీఆర్ కు వివరించారు. రెండు పేజీల లేఖను కేసీఆర్ కు పంపించారు. తనకు ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన కేసీఆర్ కు ధన్యావాదాలు తెలుపుతూ తనకు పార్టీలో జరుగుతున్న అవమానాలపై నర్సయ్య గౌడ్ నోరు విప్పారు.
Boora Narsaiah Goud : ప్రజల సమస్యలు విన్నవించేందుకు వస్తే నాకు అవకాశం ఇవ్వలేదు
నేను ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి చాలా అవమానాలు ఎదుర్కున్నా. కానీ వాటిని భరించా. పదవుల కోసం పైరవీలు చేసే వ్యక్తిని కాదు నేను. కేవలం ప్రజల సమస్యలు విన్నవించేందుకు వచ్చా. కానీ.. నాకు అప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు. నాకోసం కాకుండా బడుగు, బలహీన వర్గాల వాళ్ల సమస్యలను ప్రస్తావించా. వాళ్ల గురించి ప్రస్తావించినా సీఎం కేసీఆర్ మాత్రం అసహనం వ్యక్తం చేశారు. ఒక ఉద్యమకారుడిగా నన్ను ఇది ఎంతో బాధించింది. కేవలం ప్రజా సమస్యలపైనే నేను మాట్లాడాను కానీ.. నా స్వార్థం కోసం నేను ఏనాడూ పైరవీలు చేయలేదని బూర నర్సయ్య గౌడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.