Caste Feeling : దారుణం.. తక్కువ కులం అని తమ ముందు బుల్లెట్ నడిపాడని చేతులు నరికేశారు..!
ప్రధానాంశాలు:
Caste Feeling : దారుణం.. తక్కువ కులం అని తమ ముందు బుల్లెట్ నడిపాడని చేతులు నరికేశారు..!
Caste Feeling : ఒక దళిత యువకుడు తనకు ఇష్టమైన బుల్లెట్ బండిని bullet bike ride నడపటం ఘోరమైన నేరంగా భావించి.. రెండు చేతుల్ని నరికేసిన అరాచక ఘటన తాజాగా చోటు చేసుకుంది. తమిళనాడులోని tamil nadu శివగంగ జిల్లాలో ఈ దారుణ ఉదంతం జరిగింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు పెట్టటం.. ముగ్గుర్ని అరెస్టు చేయటం లాంటి జరిగినా.. అసలు ఇంతటి దారుణం ఎలా చేశారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

Caste Feeling : దారుణం.. తక్కువ కులం అని తమ ముందు బుల్లెట్ నడిపాడని చేతులు నరికేశారు..!
Caste Feeling దారుణ ఘటన..
మా ముందు బండి నడపడమేంటి అని కొంతమంది అగ్రవర్ణాల వారు ఆ యువకుడి రెండు చేతులూ నరికేశారు. తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. అంటరానితనం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు. ముగ్గురిని అరెస్టు చేశారు. శివగంగ జిల్లా మేల్‌పిడవూరు గ్రామానికి చెందిన దళితవర్గానికి చెందిన అయ్యాసామి, శివగంగలోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల అతడు తనకిష్టమైన బుల్లెట్ బండి కొన్నాడు.
ప్రతి రోజు తనకెంతో ఇష్టమైన బుల్లెట్ బండిని నడుపుకుంటూ కాలేజీకి పోతున్నారు. ఇతగాడి తీరును భరించలేక ఆ గ్రామానికి చెందిన అగ్రవర్ణాల వారు ఆగ్రహంగా ఉన్నారు. జాతి తక్కువవాడివి బుల్లెట్ బండి నడుపుతావా? అంటూ అతగాడి మీద దాడి చేశారు. ఈక్రమంలో కత్తులతో యువకుడి రెండు చేతులని నరికేశారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. రెండు చేతులుతెగిన వేళలో.. చుట్టుపక్కల వారు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే అతడి రెండు చేతులు అతికించేందుకు వైద్యులు సర్జరీ చేస్తున్నారు.