Caste Census Survey : బ్రేకింగ్.. తెలంగాణలో మళ్లీ కుల గణన సర్వే.. ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
ప్రధానాంశాలు:
Caste Census Survey : తెలంగాణలో మళ్లీ కుల గణన సర్వే.. ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Caste Census Survey : తెలంగాణ రాష్ట్రంలో Telangana Govt మరోసారి కుల గణన సర్వే జరుగనుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క mallu bhatti vikramarka ప్రకటించారు. ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు ఈ సర్వే నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో Hyderabad డిప్యూటీ సీఎం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదని చెప్పారు.
![Caste Census Survey బ్రేకింగ్ తెలంగాణలో మళ్లీ కుల గణన సర్వే ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Caste-Census-Survey.jpg)
Caste Census Survey : బ్రేకింగ్.. తెలంగాణలో మళ్లీ కుల గణన సర్వే.. ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Caste Census Survey సర్వేకు సహకరించని వారి కోసమే
గతంలో నిర్వహించిన సర్వేలో పాల్గొనని వారి కోసమే ఈ సారి నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే కుల గణన సర్వే Caste Census Survey కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని వివరించారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే వివరాలు వెల్లడించలేదని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ సహా పలువురు నేతలు సర్వేకు సహకరించలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల రేవంత్ రెడ్డి revanth reddy ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సర్వేలో రాష్ట్రంలో బీసీల శాతం స్వల్పంగా తగ్గినట్లు నివేదిక వెల్లడించింది.
ఈ నేపథ్యంలో 2014లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేలో 51 శాతానికి పైగా బీసీలు ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం జరిపిన సర్వేలో బీసీల శాతం దాదాపు 5 శాతానికి పైగా తగ్గడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
వచ్చేనెల కేబినెట్‌లో బిల్లు ప్రవేశం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై వచ్చేనెల కేబినెట్‌లో బిల్లు పెట్టబోతున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందాక దీన్ని కేంద్రానికి పంపుతామని.. పార్లమెంట్‌లో ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రధాని, ఇతర రాజకీయ పార్టీలను కలుస్తామన్నారు.