Andhra Pradesh : ఏపీలో ఎవరు ఎవరితో పొత్తు.. ఒంటరిగా రావడం చేతకాదా ఒక్కరికి కూడా?
Andhra Pradesh : ఏపీలో పొత్తుల రాజకీయం నడుస్తోంది ఇప్పుడు. అవును.. ఒకే ఒక్క పార్టీ వైసీపీని ఓడించడం కోసం వేస్తున్న ఎత్తుగడలు ఇవన్నీ. పొత్తుల రాజకీయాలు ఏంటో కానీ.. అసలు ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కటవ్వాలని చూస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంది కానీ.. అది కేవలం నామమాత్రపు పొత్తు మాత్రమే. పొత్తుల రాజకీయాలు ఎప్పుడు కొలిక్కి వస్తాయో కానీ.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు కూడా రెడీగా ఉన్నారు.
దానికి సంబంధించి చంద్రబాబు కూడా ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. జేపీ నడ్డాను కూడా కలిసి మంతనాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో బీజేపీతో పొత్తు విషయమే వాళ్లతో చర్చించారు. కానీ.. బీజేపీ నుంచి చంద్రబాబుకు ఎటువంటి సానుకూల సమాధానం అయితే రాలేదు. ఈనేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అసలే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయొద్దని, స్టీల్ ప్లాంట్ కు మద్దతు ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. కానీ.. వైజాగ్ ఉక్కు ఆస్తులను అమ్మేందుకు కేంద్రం మాత్రం సిద్ధమైంది. దానికి సంబంధించిన ప్రకటనను కూడా జారీ చేసింది కేంద్రం.
Andhra Pradesh : స్టీల్ ప్లాంట్ భూములను నొక్కే ప్రయత్నమేనా?
స్టీల్ ప్లాంట్ భూములను నొక్కేందుకే కేంద్రం ఈ ఆలోచన చేస్తోందనేది జీర్ణించుకోలేని వాస్తవం. స్టీల్ ప్లాంట్ పీక నొక్కేస్తున్నారు. భూములు నొక్కేస్తున్నారు అంటూ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ముందు నుంచి మొత్తుకుంటూనే ఉంది. కానీ.. ఎవరైనా పట్టించుకుంటే కదా. అవన్నీ పక్కన పెట్టి ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నా టీడీపీ, జనసేన మాత్రం బీజేపీతో పొత్తు కోసం తెగ వెంపర్లాడుతున్నాయి. ఏపీలో పర్యటిస్తూ వాళ్లు ఏదో ఘనకార్యం చేసినట్టుగా ప్రచారం చేస్తున్నారు. మరి.. వాళ్ల స్పీచ్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు ప్రస్తావించలేదు. పెట్టుబడులను ఉపసంహరించి.. ఆస్తులను అమ్మడం ఏంటి. ఇంత జరుగుతున్నా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నోరుమెదపరు. పైగా అదే పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడుతారు.