Central Govt : ఉగ్ర‌వాద దాడుల్ని లైవ్‌లో చూపించొద్దు.. సీరియ‌స్ అయిన కేంద్రం..!

 Authored By ramu | The Telugu News | Updated on :9 May 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Central Govt : ఉగ్ర‌వాద దాడుల్ని లైవ్‌లో చూపించొద్దు.. సీరియ‌స్ అయిన కేంద్రం..!

Central Govt : ప్ర‌స్తుతం భార‌త్ – పాక్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆపరేషన్ సింధూర్ త‌ర్వాత పాకిస్తాన్ భార‌త్‌ పైన ఆక్రోశం వెళ్ల‌గ‌క్కుతుంది. భారత్ లో చొరబాటుకు, దాడులకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది పాకిస్తాన్. ఇలాంటి సమయంలో భారత్ లో పలు టీవీ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్ ఫారాలు దేశం మీద జరుగుతున్న ఉగ్రదాడుల్ని లైవ్ లో చూపించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. వీటిపై కేంద్రం సీరియస్ అయింది.

Central Govt : ఉగ్ర‌వాద దాడుల్ని లైవ్‌లో చూపించొద్దు.. సీరియ‌స్ అయిన కేంద్రం..!

Central Govt : ఉగ్ర‌వాద దాడుల్ని లైవ్‌లో చూపించొద్దు.. సీరియ‌స్ అయిన కేంద్రం..!

Central Govt అలా చేయ‌కండి..

మన దేశంపై జరుగుతున్న ఉగ్రదాడుల్ని లైవ్ లో చూపించడం ద్వారా ప్రత్యర్ధి దేశాలకు మేలు చేసిన‌ట్టు అవుతుందని, ర‌క్ష‌ణ శాఖ ఓ ట్వీట్ చేసింది. అన్ని మీడియా ఛానెల్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు వ్యక్తులు రక్షణ కార్యకలాపాలు మరియు భద్రతా దళాల కదలికలను ప్రత్యక్ష ప్రసారం లేదా లైవ్ రిపోర్టింగ్ నివేదికలుగా అందించకుండా ఉండాలని సూచించింది. సున్నితమైన లేదా మూలాధార సమాచారాన్ని బహిర్గతం చేయడం వలన కార్యాచరణ సామర్థ్యం దెబ్బతింటుందని వారు పేర్కొన్నారు.

కార్గిల్‌వార్, 26/11 దాడులు మరియు కాందహార్ హైజాక్ వంటి గత సంఘటనలు అకాల నివేదికల ప్రమాదాలను నొక్కి చెబుతున్నాయని గుర్తుచేసింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (సవరణ) నియమాలు, 2021లోని క్లాజు 6(1)(p) ప్రకారం, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల సమయంలో నియమించబడిన అధికారుల ద్వారా కాలానుగుణ బ్రీఫింగ్‌లు మాత్రమే అనుమతించబడతాయని తెలిపింది. కాబట్టి దేశ సేవలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ కవరేజ్‌లో అప్రమత్తత, సున్నితత్వం, బాధ్యతను పాటించాలని రక్షణశాఖ కోరుతూ ట్వీట్ చేసింది.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి