Chaganti Koteshwararao : చాగంటి కోటేశ్వరరావుకి ఆ కీలక పదవి దక్కనుందా.. ఏం జరగబోతుంది..!
Chaganti Koteshwararao : ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలని ఎంతగా అలరిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ప్రవచనాలని చాలా ఇష్టంతో వింటుంటారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి కోసం ఆయన పేరు పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మ ప్రచార పరిషత్ సలహాదారుగా […]
ప్రధానాంశాలు:
Chaganti Koteshwararao : చాగంటి కోటేశ్వరరావుకి ఆ కీలక పదవి దక్కనుందా.. ఏం జరగబోతుంది..!
Chaganti Koteshwararao : ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలని ఎంతగా అలరిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ప్రవచనాలని చాలా ఇష్టంతో వింటుంటారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి కోసం ఆయన పేరు పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మ ప్రచార పరిషత్ సలహాదారుగా నియమితులైన సంగతి తెలిసిందే. నాడు చాగంటి కుటుంబ సమేతంగా తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లి అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు కూడా తెలిపారు.
Chaganti Koteshwararao ఆ పదవి దక్కనుందా
టీటీడీకి సలహాలు ఇవ్వడానికి తనకు పదవులు అవసరం లేదని ఆయన అన్నారు. టీటీడీకి తన సలహాలు అవసరమైతే పదవి లేకపోయినా తప్పకుండా ఇస్తానని చాగంటి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎప్పుడూ ముందు ఉంటానని అన్నారు. చాగంటి ఆ పదవిని తిరస్కరించారు.కాకినాడకు చెందిన చాగంటి కోటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ఫుడ్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్నారు. ఉద్యోగిగా తన విధులు నిర్వహిస్తూనే.. ఆ తర్వాత సమయాల్లో ప్రవచనాలు చెబుతూ అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయనని టీటీడీ ఛైర్మన్‌గా నియమించబోతుందంటూ ప్రచారం నడుస్తుంది.
ప్రస్తుతం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిశాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న వేళ చాగంటి కోటేశ్వరరావును టీటీడీ చైర్మన్ గా నియమించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని టాక్ నడుస్తోంది. రాజకీయ నేతలను టీటీడీ చైర్మన్ గా నియమిస్తే వివాదాలు మరింత పెద్దవి అవుతాయని భావిస్తున్న ప్రభుత్వం ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుందని టాక్. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇటీవల కాలం వరకు భూమన కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉండగా, ఆ పదవి కోసం చాలా మంది పేర్లు అయితే పరిశీలనలోకి వస్తున్నాయి. ఫైనల్‌గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.