Jagan VS Chandrababu : జగన్ వర్సెస్ చంద్రబాబు.. జైలులో ఎవరు ఎలా ఉన్నారంటే?
Jagan VS Chandrababu : రాజకీయ నాయకులకు రాజకీయాలు కొత్తకాదు.. కేసులు, పోలీసులు, కోర్టులు, జైలులు కూడా కొత్త కాదు. రాజకీయ నాయకుడిగా ఆరితేరాలంటే ఖచ్చితంగా ఇవన్నీ అనుభవించాల్సిందే. ఒకప్పుడు 16 నెలల పాటు అంటే సంవత్సరంనర జైలులో ఉన్న వైఎస్ జగన్ ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఒకప్పుడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు జైలుకు వెళ్లారు. ఇలా చూసుకుంటే ఏ రాజకీయ నాయకుడికైనా జైలు జీవితం అనేది పెద్ద విషయం కాదు […]

Jagan VS Chandrababu : రాజకీయ నాయకులకు రాజకీయాలు కొత్తకాదు.. కేసులు, పోలీసులు, కోర్టులు, జైలులు కూడా కొత్త కాదు. రాజకీయ నాయకుడిగా ఆరితేరాలంటే ఖచ్చితంగా ఇవన్నీ అనుభవించాల్సిందే. ఒకప్పుడు 16 నెలల పాటు అంటే సంవత్సరంనర జైలులో ఉన్న వైఎస్ జగన్ ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఒకప్పుడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు జైలుకు వెళ్లారు. ఇలా చూసుకుంటే ఏ రాజకీయ నాయకుడికైనా జైలు జీవితం అనేది పెద్ద విషయం కాదు అనేది అర్థం అవుతోంది.

#image_title
జైలుకు వెళ్లడం, జైలు నుంచి బయటికి రావడం, ఆ తర్వాత ప్రజల్లో సానుభూతి పొందడం, ఆ తర్వాత పదవులు పొందడం అనేవి కామన్ అయిపోయాయి. అలా జైలు నుంచి వచ్చి సీఎం అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. చంద్రబాబు సైతం వ్యూహాత్మకంగా జగన్ జైలుకు పంపగానే వెళ్లిపోయారు. మొదట్లో బెయిల్ పిటిషన్ వేయలేదు. సానుభూతి వచ్చాక కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకుందామని అనుకున్నారు. కానీ.. జగన్ పట్టుదలతో పాత కేసులన్నీ తవ్వి మరీ చంద్రబాబుపై మోపి ఆయన్ను జైలు నుంచి బయటికి రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేశారు. తాజాగా కోర్టుల్లోనూ చంద్రబాబుకు చుక్కెదురైంది. క్వాష్ పిటిషన్ ను కూడా కొట్టేశారు. రెండు రోజులు కస్టడీ విధించి బాబుకు షాకిచ్చింది కోర్టు.
Jagan VS Chandrababu : పగలు, ప్రతీకారాలతో జగన్, చంద్రబాబు మధ్య నడుస్తున్న వార్
ఆనాడు కాంగ్రెస్ తో కలిసి జగన్ ను జైలులోకి చంద్రబాబు పంపితే.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబును జగన్ జైలుకు పంపారు. అయితే.. ఇద్దరూ జైలుకు వెళ్లిన వారే.. ఇద్దరి జైలు జీవితం చూసుకుంటే.. వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేయనీయకుండా జగన్ ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసును బయటపెట్టి అరెస్ట్ చేశారు. జగన్, ఇతరులపై చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ క్విడ్ ప్రోకో ఒప్పందాల ప్రకారం తన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు, వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించడం కోసం తన తండ్రి వైఎస్సార్ తో కలిసి నేరపూరిత కుట్రకు జగన్ పాల్పడ్డారని అభియోగాలు మోపారు.
అనేక సందర్భాల్లో జగన్ కు బెయిల్ మంజూరు చేసేందుకు కూడా కోర్టులు నిరాకరించాయి. ఏ1 గా ఉన్న జగన్ 16 నెలలు జైలులో ఉన్నారు. హైదరాబాద్ చంచల్ గూడ జైలులో వీఐపీ ఖైదీగా ఉన్నారు జగన్. చంద్రబాబు అంత లగ్జరీ కాదు కానీ.. జైలు భోజనమే తినేవారు జగన్. దోమల బాధను కూడా జగన్ అనుభవించారు. వీఐపీగా సపరేట్ రూమ్, పేపర్లు చదవడం, సాదాసీదా సౌకర్యాలతోనే జగన్ 16 నెలలు జైలులో ఉన్నారు. మరోవైపు చంద్రబాబుకు కూడా రాజమండ్రి జైలులో వీఐపీ రూమ్, ఇంటి భోజనం తెప్పించుకునేందుకు కోర్టు స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటి నుంచి చంద్రబాబుకు భోజనం రోజూ వస్తోంది. భువనేశ్వరి కూడా అక్కడే ఉంటున్నారు. కాకపోతే దోమల బెడద అక్కడ కూడా ఉంది. చన్నీళ్లే అక్కడ ఉన్నాయి. వేడి నీళ్లు ఇవ్వడం లేదు.