Chandrababu : వైసీపీ ఆఫీసు కూల్చడంపై కారణం చెప్పిన చంద్రబాబు సర్కార్..!
Chandrababu : రాష్ట్ర రాజధాని ప్రాంతం పరిధిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూల్చి వేయడం మనం చూశాం. శనివారం తెల్లవారు జామున ఈ కూల్చివేతలు ప్రారంభం కాగా, దీనిపై కోర్టుకి వెళ్తామంటూ వైసీపీ చెబుతుతోంది. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూల్చివేయడం దారుణమని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ కక్షపూరితంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కూల్చివేసిందని దుయ్యబట్టారు.శ్లాబ్ వేయడానికి సిద్ధంగా ఉన్న భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెల్లవారు జామున 5ః30 గంటల నుంచి భారీ పోలీసులు బందోబస్తు మధ్య కూల్చి వేతలు ప్రారంభించింది. బుల్డోజర్లు, పొక్లెయినర్లను ఉపయోగించి భవన కూల్చివేత పనులు మొదలు పెట్టారు.
Chandrababu ఇది అసలు కారణం..
నిర్మాణం అక్రమం అంటూ ఇటీవలి సీఆర్‌డీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కూల్చివేతకు సీఆర్‌డీఏ తయారు చేసిన ప్రాథమిక ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ వైసీపీ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారించిన హైకోర్టు చట్టాన్ని మీరి వ్యవహరించొద్దని సీఆర్‌డీఏని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా వైసీపీ తరపు న్యాయవాది సీఆర్‌డీఏ కమిషనర్‌కు తెలిపారు. అయినప్పటికీ టీడీపీ ప్రభుత్వం… వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేసింది. తాడేపల్లి వైసీపీ ఆఫీసు కూల్చివేత అంశంపై ప్రభుత్వం స్పందించింది.
వైసీపీ అక్రమ నిర్మాణంపై వివరణ ఇవ్వాలంటూ గత నెలలోనే మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. పలుమార్లు నోటీసులిచ్చినా వైసీపీ లెక్కచేయలేదని అధికారులు తెలిపారు. వైసీపీ జిల్లా ఆఫీసుకు గతనెల 5న మొదటిసారి నోటీసులు అందినట్లు చెబుతున్నారు ప్రభుత్వం. మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు పంపించారు. మున్సిపల్ అధికారుల నోటీసులను వైసీపీ పట్టించుకోకపోవడంతో ఈనెల 10న రెండోసారి నోటీసులను పంపించారు. ఈ అక్రమ నిర్మాణంపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది వైసీపీ. అధికారులు ఇచ్చిన గడువు ఈనెల 17తో పూర్తియినా వైసీపీ నుంచి స్పందన లేకపోవడంతో 20న కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశామని ప్రభుత్వం చెబుతోంది. మున్సిపల్ అధికారుల ఆదేశాలతో ఈ రోజు వైసీపీ ఆఫీసును కూల్చివేశారు.