Big Breaking : చంద్రబాబుకి బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. బెయిల్ వచ్చిందా?
Chandrababu Arrest : చంద్రబాబును గత నెల సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ముందు ఆయన 14 రోజుల పాటు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. కానీ.. ఆ తర్వాత మళ్లీ తన రిమాండ్ ను పొడిగించారు. సీఐడీ విచారణలో చంద్రబాబు ఎలాంటి సమాధానాలు చెప్పకపోవడంతో ఇక తప్పని పరిస్థితుల్లో ఆయన రిమాండ్ ఇంకాస్త పొడిగించారు. అంతే కాదు.. ఆయన బెయిల్ పిటిషన్ ను కూడా తిరస్కరించింది కోర్టు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ మాత్రమే కాదు.. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లోనూ చంద్రబాబు పేరును సీఐడీ అధికారులు చేర్చారు. తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పై, సీఐడీ కస్టడీ పిటిషన్ పై రెండు పిటిషన్లపై ఒకేసారి ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.
ఈ రెండు పిటిషన్లపై వాదనలు కూడా ముగిశాయి. వాదనలు ముగిసినా తీర్పును మాత్రం న్యాయస్థానం వెల్లడించలేదు. తీర్పును రిజర్వ్ చేసి వచ్చే సోమవారం తీర్పును వెల్లడిస్తామని కోర్టు ప్రకటించింది. చంద్రబాబు తరుపున సుప్రీంకోర్టు లాయర్ ప్రమోద్ కుమార్ తమ వాదనలు వినిపించగా.. సీఐడీ తరుపున అడిషనల్ ఏజీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇంకా చంద్రబాబు బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకోవాలని.. ఆయన్ను విచారించేందుకు ఇంకాస్త సమయం కావాలని సీఐడీ తరుపున న్యాయవాది సుధాకర్ రెడ్డి వాదించగా.. ఇప్పటికే సీఐడీ కస్టడీకి చంద్రబాబును ఇచ్చారని.. మరోసారి చంద్రబాబును కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని.. మొదటిసారి కస్టడీకి ఇచ్చినప్పుడే వివరాలన్నీ తెలుసుకోవాలని కోర్టులో చంద్రబాబు తరుపు లాయర్ వాదనలు వినిపించారు.