Chandrababu Naidu : ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు జరగగా, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వారికి దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో సీఎం మాట్లాడుతూ.. రానురాను ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోందని.. ఇది మంచిది కాదని… నిరంతరం నేర్చుకోవాలి… తెలుసుకోవాలని సూచించారు. ‘‘ఇప్పుడు ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నారో నేను కూడా నోట్ చేసుకుంటున్నా. కేంద్ర బడ్జెట్‌లో కూడా ఏ విధమైన నిధుల కేటాయింపులు ఉన్నాయో స్టడీ చేసుకుంటే ఎమ్మెల్యేలకు ఉపయోగపడుతుంది.
పని చేయాలన్న ఆసక్తి మీలో ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముంది అని అనుకోవద్దు. వాళ్లకు బాధ్యత లేదు… కానీ మనకు ఉంది. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం. ప్రజలకు ఏం అవసరమో… ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక. అసెంబ్లీకి మేము పంపిన ప్రతినిధి మా కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడూ గమనిస్తారు’’ అని తెలిపారు. ఎమ్మెల్యేలు రాష్ట్ర సంపదగా తయారు కావాలని అభిలషించారు. ప్రజా సమస్యల వేదికగా అసెంబ్లీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. “తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలందరిలో నేనే సీనియర్. ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటాను. అసెంబ్లీ సమావేశాలను ప్రతి ఎమ్మెల్యే సీరియస్ గా తీసుకోవాలి” అని పిలుపునిచ్చారు.
సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో స్వాగతించరని.. గతంలో అదే జరిగిందన్నారు. శాఖల్లో ఏం జరుగుతుందో ఎమ్మెల్యేలకు అవగాహన లేకపోతే నియోజకవర్గానికి ఏం అవసరమో తెలియదన్నారు. బడ్జెట్ సమావేశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని చెప్పుకొచ్చారు. బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలని…. వచ్చే మంచి ఆలోచనలు సభలో పంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలన్నారు. పబ్లిక్ గవర్నెన్స్‌లో ఎమ్మెల్యేలనూ భాగస్వామలను చేస్తామన్నారు. ప్రజలు ఎన్నో ఆశలు, నమ్మకం పెట్టుకున్నందున సమస్యలపై సభలో చర్చించాలని తెలిపారు. అర్థవంతమైన చర్చలకు సభ వేదిక కావాలన్నారు.
Colon Cancer : మీరు మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.? ఏదైనా తిన్న వెంటనే కడుపు నిండుగా అనిపిస్తుందా. మీ సమాధానం…
Ys Sharmila : ఏపీలో AP News జగన్ Ys Jagan , షర్మిళ మధ్య జరుగుతున్న ఫైటింగ్ చర్చనీయాంశంగా…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి పథకం ఇచ్చి నిరుద్యోగ యువతకు ఆర్ధిక సాయం…
Kanguva Movie Review : కోలీవుడ్ Kollywood స్టార్ Surya సూర్య లీడ్ రోల్ లో శివ డైరెక్షన్ లో…
Pineapple : ప్రస్తుత కాలంలో మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లలను తీసుకుంటూ ఉంటాం. వాటిలో పైనాపిల్ కూడా…
Lagcherla : ఫార్మా సిటీ ప్రాజెక్టుకు సంబంధించి ఈ నెల 11న విచారణ సందర్భంగా వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండలం…
Prabhas Raja Saab : స్టార్ సినిమాను మొదలు పెట్టడం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం చాలా సులువే కానీ…
Carrot Juice : చలికాలం రానే వచ్చేసింది. ఈ కాలంలో పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా దొరుకుతాయి. అలాగే మార్కెట్‌లో ఎటు…
This website uses cookies.