Chandrababu – YS Jagan : పెద్ద స్కెచ్ తోనే డిల్లీలో దిగిన చంద్రబాబు – కానీ దాన్ని మించే స్కెచ్ వేసిన జగన్ !
Chandrababu – YS Jagan : ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. త్వరలో అంటే ఇంకా సంవత్సరం సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల హడావుడి మొదలైంది. ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలను రచిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల విషయంతో సీరియస్ గా ఉన్నారు. ఆయన ఇప్పుడు రూట్ మార్చారు. నిజానికి ఏ పార్టీ వస్తే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని యోచిస్తున్నారు చంద్రబాబు.అనధికారికంగా జనసేన పార్టీలో ఇప్పటికే పొత్తు ఖరారు అయినట్టే. కానీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుపై ఇంకా క్లారిటీ తెచ్చుకోవడం లేదు.
బీజేపీతోనూ పొత్త పెట్టుకోవాలని చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు కానీ.. బీజేపీ మాత్రం చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేందుకు ససేమిరా అంటోంది. దీంతో బీజేపీని టార్గెట్ చేశారు చంద్రబాబు. అందుకే మరోసారి ప్రత్యేక హోదా అంటూ కొత్త నినాదం తెర మీదికి తీసుకొచ్చారు. కేంద్రంతో సీఎం జగన్ లాలూచీ పడి ప్రత్యేక హోదాను మరిచారని అన్నారు.ఇప్పటి వరకు ఏపీ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించిన చంద్రబాబు.. తాజాగా ఇందులో బీజేపీని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలే ఎన్నికలు వచ్చే సంవత్సరం ఉంటాయా? లేక ముందస్తు ఎన్నికలు ఉంటాయా? అనేది సుస్పష్టం కాని వేళ.. చంద్రబాబు వెరైటీ రాజకీయాలు చేస్తున్నారు.
Chandrababu – YS Jagan : సీఎం జగన్ తో పాటు బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం
నిజానికి.. టీడీపీ, జనసేన ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తున్నారు. దీనిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా ఇప్పటికే మంతనాలు జరిపారు. కానీ.. బీజేపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో బీజేపీతో పొత్తు కన్ఫమ్ అయినట్టేనా అనేదానిపై క్లారిటీ లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతోనే పొత్తు ఉంటుందా? ముందస్తు ఎన్నికల సమాచారం నేపథ్యంలో చంద్రబాబు రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. చూద్దాం మరి ఇంకెన్ని రాజకీయ మలుపులు చోటు చేసుకుంటాయో?