Chiranjeevi : ఆ రోజు మోదీ.. చిరు, పవన్ కళ్యాణ్‌లతో మాట్లాడింది ఇదే..!
ప్రధానాంశాలు:
Chiranjeevi : ఆ రోజు మోదీ.. చిరు, పవన్ కళ్యాణ్‌లతో మాట్లాడింది ఇదే..!
Chiranjeevi : మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసారు. రాజకీయాలలో కూడా సత్తా చాటారు. చిరంజీవి అంతగా రాణించకపోయిన పవన్ కళ్యాణ్ మాత్రం సత్తా చాటారు. అయితే చిరంజీవి, పవన్ స్టార్ పవన్ కల్యాణ్ మధ్య అనుబంధం అపూర్వంగా ఉంటుంది. తమ్ముడిపై చిరూ ఎనలేని ఆప్యాయత చూపితే.. అన్నపై పవన్ చాలా గౌరవం చూపిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఈ అన్నదమ్ముల అపూర్వమైన అనుబంధం మరోసారి అందరినీ ఆకట్టుకుంది. కాగా.. చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‍ను ప్రధాని మోదీ ఆప్యాయంగా దగ్గర తీసుకోవడం ఈ కార్యక్రమానికి హైలైట్‍గా నిలిచింది.
Chiranjeevi జరిగింది ఇదే..
ప్రమాణ స్వీకారాలు అయిపోయిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. చిరంజీవి, పవన్ కల్యాణ్ చేతులు పట్టుకొని మరీ వేదిక మధ్యకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ముగ్గురూ చేతులు కలిపి ప్రేక్షకులను అభివాదం చేశారు. ఆ తర్వాత ఇద్దరినీ దగ్గరికి తీసుకొని మోదీ అభినందించారు. సంతోషంగా మాట్లాడారు. ఆ సమయంలో చిరంజీవి, పవన్ ఉద్వేగానికి లోనయ్యారు. పవన్ గడ్డంపై చేయి వేసి ఆప్యాయత చూపారు చిరూ. వేదిక కింద నుంచి చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ కూడా ఈ దృశ్యాలను చూసి ఎమోషనల్ అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఈ వీడియో చూసి మెగా అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరి కష్టానికి తగిన ప్రతిఫలం ఇది అంటూ రాసుకొచ్చారు.
కాగా.. స్టేజీపై మెగా బ్రదర్స్ చేతులు పట్టుకుని మోదీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారు అన్న విషయాలపై చిరంజీవి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ.. నాతో, తమ్ముడితో వేదికపై మాట్లాడడం ఎంతో ఆనందంగా అనిపించిందని చిరంజీవి అన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత మొదటిసారి పవన్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ప్రధాని చూసినట్లుగా చెప్పారని చిరు చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానుబంధాలు అందులో కనిపించాయన్నారు. ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని మెచ్చుకున్నారు. ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శం గా నిలుస్తాయని చెప్పారు. తమ్ముడి స్వాగతోత్సవం లాగే మోదీతో మా సంభాషణ కలకాలం గుర్తిండిపోయే ఓ అపురూప జ్ఞాపకం అని చిరు తెలిపారు.