YS Jagan : ఈ ఒక్క కారణం చాలు.. జగన్ ని దేవుడు అనడంలో తప్పే లేదు
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం పేదల పాలిట దేవుడు అయ్యారు. పేద ప్రజల కన్నీళ్లను తీరుస్తున్నారు. పేదల కోసం సంక్షేమ పథకాలను ప్రారంభించారు. కేవలం పేదల కోసమే తీసుకొచ్చిన చాలా పథకాల ద్వారా ఎందరో పేదలు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి తీసుకురాని పథకాలను తీసుకొచ్చి దేశంలోనే నెంబర్ వన్ సీఎంగా చరిత్ర సృష్టించారు సీఎం జగన్.
ఇదంతా ఓకే కానీ.. ఇప్పుడు సీఎం జగన్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఎందుకంటే.. ఇటీవల కోనసీమలో వరద బాధితులను కలవడానికి వెళ్లిన సీఎం జగన్.. ఓ విషయంలో చాలా బాధపడ్డారు. హనీ అనే ఓ చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడటం చూసి చలించిపోయారు జగన్. ఆ చిన్నారి తల్లిదండ్రులు ప్లకార్డు పట్టుకొని సీఎం జగన్ దృష్టిలో పడటంతో వెంటనే ఆ చిన్నారి చికిత్స కోసం ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా ట్రీట్ మెంట్ ఇప్పించాలని అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ ను సీఎం జగన్ ఆదేశించారు.
YS Jagan : హనీ వైద్యం కోసం కోటి రూపాయలు ప్రకటించిన సీఎం జగన్
వెంటనే హనీ వైద్యం కోసం సీఎం జగన్ కోటి రూపాయలు మంజూరు చూస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ చిన్నారికి వచ్చిన వ్యాధి గాకర్స్ అనే అరుదైన వ్యాధి. దానికోసం దొరికే ఇంజక్షన్ చాలా ఖరీదైంది. ఆ ఇంజక్షన్ ఖరీదు ఒక్కటి రూ.1,25,000 గా ఉంటుంది. ప్రతి 15 రోజులకు ఒక ఇంజక్షన్ ను చిన్నారికి క్రమం తప్పకుండా ఇస్తేనే ఆ చిన్నారి బతుకుతుంది. అందుకే ఆ చిన్నారికి కావాల్సిన ఇంజక్షన్లను సీఎం జగన్ మంజూరు చేయించారు. అలాగే.. చిన్నారి వ్యాధి తగ్గాక తన చదువు కోసం కూడా ముఖ్యమంత్రి సాయం చేస్తానని మాటివ్వడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఆ చిన్నారికి వచ్చిన వ్యాధి చాలా అరుదైనదని, దేశంలో ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు 14 మంది ఉన్నారని ఈ వ్యాధిపై రీసెర్చ్ చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ తెలిపారు.