Revanth Reddy : కేటీఆర్ దగ్గర ఉన్న లక్ష కోట్లు కక్కిస్తా.. రక్తపు కూడు తింటున్నావు నువ్వు.. రేవంత్ రెడ్డి ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : కేటీఆర్ దగ్గర ఉన్న లక్ష కోట్లు కక్కిస్తా.. రక్తపు కూడు తింటున్నావు నువ్వు.. రేవంత్ రెడ్డి ఫైర్

 Authored By kranthi | The Telugu News | Updated on :29 December 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  ఉన్నవి కూలగొట్టుడు ఎందుకు.. కొత్తవి కట్టుడు ఎందుకు

  •  ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించిన డబ్బు అది

  •  అంతా కక్కిస్తాం.. కక్కేలా చేస్తాం

Revanth Reddy : తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 రోజులు అవుతోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే అభయ హస్తం స్కీమ్ కింద ఆరు గ్యారెంటీ స్కీమ్ ల మీద సంతకం పెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే మహాలక్ష్మీ స్కీమ్ లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ లాంచ్ అయింది. తాజాగా ప్రజా పాలన పేరుతో అభయ హస్తం స్కీమ్ లోని ఇతర 5 స్కీమ్ ల కోసం దరఖాస్తును స్వీకరిస్తున్నారు. రైతు భరోసా, గృహజ్యోతి, మహాలక్ష్మీ, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు లాంటి స్కీమ్స్ అన్నింటికీ ఒకే దరఖాస్తును తీసుకొచ్చారు. దానికి ప్రజా పాలన పేరు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేశారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

99,999 కోట్ల రూపాయలు కేటీఆర్ దగ్గర ఉన్నాయి. లక్ష కోట్ల సంపాదనలో ఒక లక్ష పోయినా మిగితావి ఉన్నాయి. అవన్నీ పంచాలి. వాటిని పంచాల్సిన పరిస్థితిని తీసుకొస్తాం. అవి పంచకుండా తప్పదు అని చెప్పుకొచ్చారు. మేము ఉన్న వాస్తవాలు బయటపెట్టాం. మా ఆర్థిక మంత్రి వాస్తవాలను టేబుల్ చేసి మీరేం చెబుతారో చెప్పండి అని రోజంతా సమయం ఇచ్చాం. అక్కడ చెప్పాల్సింది చెప్పకుండా ఇంటికాడికి వెళ్లి మరో దుకాణం తెరిచారు. వాళ్ల దగ్గర ఉన్న ఆస్తి ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద. ఈరోజు వాళ్లు తింటున్నారంటే అది రక్తపు కూడు. మా వాళ్లు ఏం చెప్పారు.. నిజంగా ఉపయోగ పడే వాటిని కూలగొట్టి మళ్లీ నిర్మించారని అన్నారు.

Revanth Reddy : ఉన్నవి కూలగొట్టి.. కొత్తవి కట్టుడు ఎందుకు?

సచివాలయమే తీసుకోండి. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం.. 2012 లో ఎల్ అండ్ టీ కంపెనీ కట్టిన భవనం అది. 12 లక్షల స్కైర్ ఫీట్ ఉండేది. ఆ రాష్ట్రం తరలిపోయాక అంతా మనకే ఉండేది. ఇతర ప్రభుత్వ ఆఫీసులు కూడా ఇక్కడికే తెచ్చి పెట్టాల్సి ఉంది. ఒకవేళ మీకు ఇది అచ్చిరాకపోతే దీన్ని ఏదైనా ఆసుపత్రిగానో.. వేరే ప్రభుత్వ డిపార్ట్ మెంట్ గా ఏర్పాటు చేసి ఖాళీ జాగలో కొత్త సచివాలయాన్ని కడితే ఇదీ ఉపయోగపడుతుండేది.. అక్కడ అది ఉపయోగపడుతూ ఉండేది. అక్కడ కూలగొట్టి భవనాలు కట్టారు. ఉన్నదాన్ని కూలగొట్టి కొత్త భవనాలు కట్టారంటే వాళ్లు ఎందుకు కట్టారో అర్థం చేసుకోవచ్చు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది