Ys Jagan : సీఎం జగన్ బందరు పోర్టు పనులు ప్రారంభిస్తూ.. కృష్ణాజిల్లా చరిత్రను మార్చే అస్త్రం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : సీఎం జగన్ బందరు పోర్టు పనులు ప్రారంభిస్తూ.. కృష్ణాజిల్లా చరిత్రను మార్చే అస్త్రం…!

 Authored By sekhar | The Telugu News | Updated on :22 May 2023,3:00 pm

Ys Jagan : నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బందరు పోర్టు నిర్మాణానికి సంబంధించి పనులకు శంకుస్థాపన చేశారు. మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… బందర్ పోర్టు చిరకాల స్వప్నమని అన్ని సమస్యలను అధిగమించి పోర్టుకు లైన్ క్లియర్ చేశామని స్పష్టం చేశారు. సముద్ర వ్యాపారానికి సంబంధించి బందరుకు వందల ఏళ్ల చరిత్ర ఉందని.. కానీ పోర్టు.. నిర్మాణం గురించి ఎవరు పట్టించుకోలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బందరు వాసుల కలను నెరవేర్చడం జరిగింది. కృష్ణాజిల్లా చరిత్రను మార్చే అస్త్రంగా పోర్టు మారబోతుందని స్పష్టం చేశారు. 35.12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టు నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు.

పోర్టుకు కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ను కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. అలాగే గుడివాడ మచిలీపట్నం రైల్వే లైన్ పోర్ట్ కు అనుసంధానం చేయనున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. పరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, చతిస్ ఘడ్ చెరువులో ఉంటుందని పేర్కొన్నారు. పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల… లక్షరాజమందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు. 24 నెలల లోనే నిర్మాణం పూర్తయి మచిలీపట్నం రూపురేఖలు మారిపోతాయి. పెద్ద పెద్ద ఓడలు బందరు తీరనికొస్తాయి అని స్పష్టం చేశారు. ఒకప్పుడు బందర్ ముఖ్య పట్టణమైన కలెక్టర్ తో పాటు ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ ఉండేవారు కాదు.

cm Ys jagan inaugurating MACHILIPATNAM PORTFOUNDATION

cm Ys jagan inaugurating MACHILIPATNAM PORTFOUNDATION

జిల్లా కేంద్రంలోనే కలెక్టర్ తో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం ఉండేలా జిల్లాల విభజనతో చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మేము అధికారంలోకి వచ్చాక రైతుల కల సాకారం చేసాం. ₹5516 కోట్లతో పోర్టు పనులు జరుగుతున్నాయి. అన్ని సమస్యలను అధిగమించి పోర్టుకు లైన్ క్లియర్ చేసాం. పోర్టు ఆధారత పరిశ్రమల ద్వారా అనేక ఉద్యోగాలు రానున్నాయి ఉపాధి కలగనుంది అని.. బందరు పోటు నిర్మాణ భూమి పూజ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది