Vemula VS Chirumarthi : వేముల దెబ్బకు చిరుమర్తి ఔట్.. వేముల గెలుపు ఖాయం.. నకిరేకల్‌లో హస్తం హవా
ప్రధానాంశాలు:
వేముల వీరేశం గెలుపు ఖాయమేనా?
చేతులెత్తేసిన చిరుమర్తి లింగయ్య
నియోజకవర్గం మొత్తం వేముల వైపే
Vemula VS Chirumarthi : తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉండే రాజకీయాలు వేరు. నల్గొండ జిల్లా రాజకీయాలు వేరు. అందులో నకిరేకల్ నియోజకవర్గం తీసుకుంటే ప్రస్తుతం వేముల వర్సెస్ చిరుమర్తి అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఎందుకంటే.. తనకు బీఆర్ఎస్ టికెట్ దక్కలేదని ఎలాగైనా బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలని.. తాను ఎమ్మెల్యే కావాలన్న కసితో కాంగ్రెస్ పార్టీలో చేరారు వేముల వీరేశం. వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరగానే తనకు నకిరేకల్ టికెట్ ను కేటాయించింది కాంగ్రెస్ అధిష్ఠానం. చిరుమర్తి లింగయ్య ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చింది. నిజానికి నకిరేకల్ కాంగ్రెస్ అడ్డా. వేముల వీరేశంకు అక్కడ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈసారి వేముల వీరేశం గెలుపు ఖాయం అనే మాటలు వినిపిస్తున్నారు. చిరుమర్తి ఎంత ప్రచారం చేసినా ఆయనకు అనుకూలమైన పరిస్థితులు లేవు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోంది. దీంతో చిరుమర్తికి ఏం చేయాలో అర్థం కావడం లేదు.
నామినేషన్ల ప్రక్రియ మొదలవగానే నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. తాను ఓటమిని బహిరంగంగా అంగీకరించారు. నకిరేకల్ లో కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయం అని వేముల చెప్పుకొచ్చారు. వేముల వీరేశానికి నియోజకవర్గంలో భారీగా స్పందన వస్తోంది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ కు అమ్ముడు పోయిన చిరుమర్తిని మరోసారి నకిరేకల్ ప్రజలు ఎందుకు గెలిపిస్తారు అంటూ వేముల మండిపడ్డారు. మరోవైపు నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. చిరుమర్తి క్యాడర్ మొత్తం పార్టీ వీడుతున్నారు. ఈనేపథ్యంలో రామన్నపేట మండలం జెడ్పీటీసీ సభ్యురాలు పున్న లక్ష్మీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మంతటి ఉదయ్ రెడ్డి రాజీనామా చేశారు. పలు గ్రామాల సర్పంచ్ లు కూడా రాజీనామా చేశారు. వీరి బాటలోనే మరికొంత మంది రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. చిరుమర్తి లింగయ్య సొంత మండలానికి చెందిన బీఆర్ఎస్ నేతలు కూడా పార్టీ మారుతున్నారు.
Vemula VS Chirumarthi : ప్రచారం కూడా చేయని చిరుమర్తి
చిరుమర్తి వ్యవహారంపై చాలామంది బీఆర్ఎస్ నేతలు అసంతృప్తితో ఉండటంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. మరోవైపు వేములకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో జనాలు, నాయకులు వేముల వెంటే ఉన్నారు. దీంతో చిరుమర్తి ఇక ప్రచారం చేసినా లాభం లేదనుకొని చేతులు ఎత్తేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులు చేతులెత్తేస్తే ఇక ప్రజలు మాత్రం ఏం చేస్తారు. అందుకే వేములకే తమ ఓటు అని ప్రకటిస్తున్నారు.