Sabitha Indra Reddy : మహేశ్వరంలో సబితకు భారీ షాక్ ఇచ్చిన కాంగ్రెస్.. ఆ నేత బరిలోకి దిగితే వార్ వన్ సైడే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sabitha Indra Reddy : మహేశ్వరంలో సబితకు భారీ షాక్ ఇచ్చిన కాంగ్రెస్.. ఆ నేత బరిలోకి దిగితే వార్ వన్ సైడే?

Sabitha Indra Reddy : సబితా ఇంద్రారెడ్డి తెలుసు కదా. తెలంగాణ విద్యా శాఖ మంత్రి. మహేశ్వరం నియోజకవర్గం తన అడ్డా. అక్కడ సబితా ఇంద్రారెడ్డికి ఉన్న పాపులారిటీ మామూల్ది కాదు. అందుకే సబితా ఇంద్రారెడ్డిని కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేర్చుకొని మరీ సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం నియోజకవర్గంలో మంత్రి సబితా రెడ్డి కృషి చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన […]

 Authored By kranthi | The Telugu News | Updated on :31 October 2023,6:00 pm

ప్రధానాంశాలు:

  •  23 ఏళ్ల కింద సబితను ఢీకొట్టిన నేత మళ్లీ ఇప్పుడు

  •  సబితను ఓడించే సత్తా ఆనేతకు ఉందా?

  •  ఎలాగైనా సబితను ఓడించాలని కాంగ్రెస్ ఎందుకు మొండిపట్టు పడుతోంది?

Sabitha Indra Reddy : సబితా ఇంద్రారెడ్డి తెలుసు కదా. తెలంగాణ విద్యా శాఖ మంత్రి. మహేశ్వరం నియోజకవర్గం తన అడ్డా. అక్కడ సబితా ఇంద్రారెడ్డికి ఉన్న పాపులారిటీ మామూల్ది కాదు. అందుకే సబితా ఇంద్రారెడ్డిని కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేర్చుకొని మరీ సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం నియోజకవర్గంలో మంత్రి సబితా రెడ్డి కృషి చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబితా రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి పదవి కూడా వచ్చింది. మళ్లీ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి మహేశ్వరం టికెట్ కేటాయించింది. ఈసారి ఎన్నికలు చాలా టఫ్ కాబోతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యంతో బీఆర్ఎస్ పార్టీ ఆచీతూచీ అడుగులు వేస్తోంది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఏ అభ్యర్థులను అయితే నిలుపుతుందో.. వాళ్లకు తగ్గట్టుగా.. గట్టి పోటీ ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీ దీటైన నాయకులను బరిలోకి దించుతోంది. గజ్వేల్, కామారెడ్డి లాంటి నియోజకవర్గాలను కూడా కాంగ్రెస్ వదలడం లేదు అంటే.. కాంగ్రెస్ ఈసారి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నదో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గాన్ని కూడా టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. మహేశ్వరం నుంచి పోటీ చేస్తున్నది ఎవరో కాదు.. బీఆర్ఎస్ నుంచి సబితా రెడ్డి పోటీ చేస్తున్నారు. సబితా రెడ్డికి మహేశ్వరంలో ఉన్న బలం అందరికీ తెలుసు. అలాంటి నియోజకవర్గంలో సబితను ఓడించాలంటే ఖచ్చితంగా ఆమెకు దీటైన నేతనే తీసుకురావాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ప్లాన్ వేసింది. మహేశ్వరంలో అసలైన సిసలైన నాయకుడిని బరిలోకి దించుతోంది. ఆ నేత కనుక మహేశ్వరం నుంచి పోటీ చేస్తే సబితా ఇంద్రారెడ్డి కూడా తట్టా బుట్టా సర్దుకొని పోవాల్సిందే అన్నట్టుగా ఉంటుంది అక్కడ పోటీ. ఇప్పటికే సబితా రెడ్డికి వ్యతిరేకంగా ఆ నేత ఒకప్పుడు పోటీ చేసిన వ్యక్తే. ఇప్పుడు కాదు రెండు దశాబ్దాల కిందనే సబితకు అసలైన పోటీ ఇచ్చిన ఆ నేత మళ్లీ 2023 ఎన్నికల్లో సబితకు పోటీగా బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది.

Sabitha Indra Reddy : కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమేనా?

కాంగ్రెస్ నుంచి ఈసారి మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఆయన 23 ఏళ్ల కిందనే సబితారెడ్డికి పోటీగా ఎన్నికల బరిలో నిలుచున్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికే కాంగ్రెస్ పెద్దలు లక్ష్మారెడ్డిని ఢిల్లీకి పిలిచారట. 2000 లో జరిగిన ఉపఎన్నికల్లో ఇంద్రారెడ్డి స్థానంలో సబితా రెడ్డి పోటీ చేశారు. ఆ సమయంలో టీడీపీ నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి చేవెళ్లి నుంచి సబితారెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేశారు. ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొన్నది. సబితా రెడ్డి గెలిచినా కూడా లక్ష్మారెడ్డి అప్పట్లోనే ఆమెకు గట్టి పోటీనిచ్చారు. అందుకే మరోసారి సబితా రెడ్డిని ఢీకొట్టడానికి లక్ష్మారెడ్డి అయితేనే కరెక్ట్ అని భావించి కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నుంచి లక్ష్మారెడ్డిని బరిలోకి దించుతోంది. చూడాలి మరి.. మహేశ్వరంలో ఎవరు నెగ్గబోతున్నారో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది