Telangana Congress : 20 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఫిక్స్ చేసిన మంత్రి కేటీఆర్
Telangana Congress : తెలంగాణలో ఎన్నికల హడావుడి స్టార్ట్ అయింది. ఇంకో రెండు నెలల్లో తెలంగాణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసిలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. అధికార బీఆర్ఎస్ అయితే ఈసారి మళ్లీ గెలిసి హ్యాట్రిక్ సాధించాలన్న కసితో ఉంది. బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి తెలంగాణలో గెలిచి సౌత్ ఇండియాను కూడా ఏలాలని ఆశపడుతోంది. ఇక.. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచిన ఊపుతో తెలంగాణలోనూ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని తెగ ఆరాటపడుతోంది. ఇవన్నీ ఓకే కానీ.. కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీఆర్ఎస్ ను ఓడించే సత్తా ఉందా అంటే.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే చెప్పుకోవాలి. అవును.. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీభత్సమైన క్రేజ్ వస్తోంది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో రోజురోజుకూ కాంగ్రెస్ బలం పెరుగుతోంది.
మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తెలంగాణ రాజకీయాలను కూడా మలుపు తిప్పుతోంది. చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణలో నిరసనలు తెలుపుతున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, తెలంగాణ పోలీసులు ధర్నాలకు అనుమతి ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. తెలంగాణకు, చంద్రబాబు అరెస్ట్ కు ఏంటి సంబంధం. అసలు తెలంగాణలో మీరు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తుంటే చూస్తూ కూర్చొంటామా? మీ ఊరిలో, మీ రాష్ట్రంలో ఎక్కడైనా ధర్నాలు చేసుకోండి. తెలంగాణలో అది కుదరదు. మళ్లీ ఐటీ ప్రాంతాల్లో ధర్నాలు చేస్తామంటే ఊరుకుంటారా? అస్సలు కుదరదు.. అంటూ మంత్రి కేటీఆర్ కూడా చంద్రబాబు అరెస్ట్ పై నిరసనలు తెలిపిన వారికి కౌంటర్ ఇచ్చారు. తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వల్ల హైదరాబాద్ లో, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రా సెటిలర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ కి తెలంగాణకు సంబంధం లేదు అనే కేటీఆర్.. ఆంధ్రా సెటిలర్స్ ఓట్లు మాత్రం ఎందుకు అడుగుతున్నారు.. అంటూ వాళ్లంతా ఈసారి బీఆర్ఎస్ కు వ్యతిరేకం అయ్యే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

#image_title
Telangana Congress : 20 సీట్ల వరకు బీఆర్ఎస్ కు లాస్?
కేవలం చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వల్ల దాదాపు 20 సీట్లపై ప్రభావం చూపించనుందట. దాదాపు 20 నియోజకవర్గాల్లో ఆంధ్రా సెటిలర్స్ దే హవా. వాళ్లు ఎవరికి ఓట్లేస్తే ఆ పార్టీదే గెలుపు. అయితే.. సెటిలర్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ నోటిదురద వల్ల కాంగ్రెస్ కు లాభం చేకూరినట్టయింది. మంత్రి కేటీఆర్ దగ్గరుండి మరీ.. 20 సీట్ల వరకు కాంగ్రెస్ ను గెలిపించేందుకు దోహదపడుతున్నారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?