Ration Cards : వారందరికీ రేషన్ కార్డ్స్ కట్... కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ రేషన్ కార్డుల వినియోగంపై సమగ్రంగా సమీక్ష జరిపింది. గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోని కార్డుదారుల వివరాలను సేకరించి, వారిని అనర్హులుగా గుర్తించి రేషన్ కార్డులను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 76,842 రేషన్ కార్డులు వినియోగంలో లేనివిగా తేలడంతో, వాటిని రద్దు చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Ration Cards : వారందరికీ రేషన్ కార్డ్స్ కట్… కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పంపిన జాబితాను ఆధారంగా తీసుకుని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆ వివరాలను పంపించింది. కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అనర్హులైనవారిని గుర్తించారు. ఇందులో మరణించిన లబ్ధిదారులు, ఆధార్ వివరాలు సరైన విధంగా నమోదు కానివారు, ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు ఉన్నారు. వీరి రేషన్ కార్డులను తొలగించి లబ్ధిదారుల జాబితాను పునర్వ్యవస్థీకరించేందుకు సర్కారు సిద్ధమవుతోంది.
ఇక ఈ రద్దయే కార్డులు ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాల్లో ఉన్నాయని వెల్లడైంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 91.83 లక్షల రేషన్ కార్డులు ఉండగా, తాజాగా ప్రభుత్వం కొత్తగా మరో 2 లక్షల రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చర్యల ద్వారా నిజమైన లబ్ధిదారులకు రేషన్ అందేలా పౌరసరఫరాల శాఖ పటిష్టంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
This website uses cookies.