Chandrababu Pawan Kalyan : హస్తినకు బాబు, పవన్ కళ్యాణ్… ప్రత్యేక హోదాకు ఇదే మంచి చాన్స్..!
ప్రధానాంశాలు:
Chandrababu Pawan Kalyan : హస్తినకు బాబు, పవన్ కళ్యాణ్... ప్రత్యేక హోదాకు ఇదే మంచి చాన్స్..!
Chandrababu Pawan Kalyan : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారం వేర్వేరుగా ఢిల్లీ బయలుదేరారు. ఎన్నికల్లో భారీ విజయం తర్వాత తొలిసారి వారు ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకొని ఎన్టీయే సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ సహా ఇతర కీలక నాయకులు హాజరుకానున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, జనసేన మద్దతు కీలకం కానున్న నేపథ్యంలో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు మద్దతు తెలపనున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం సాయంత్రం 6 గంటలకు వారు తిరిగి విజయవాడ రానున్నారు.
ఈసారి బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించకపోవడంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల అవసరం తప్పనిసరిగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్, బిహార్‌ల నుంచి చంద్రబాబు, నితీశ్ కుమార్‌ల మద్దతు మోదీకి తప్పనిసరి. ఈ సమావేశంలో బిహార్ నుంచి నితీశ్ కుమార్ సైతం పాల్గొననున్నారు. ఏపీలోని కూటమికి చెందిన 21 లోక్ సభ సీట్లు బీజేపీకి కీలకంగా మారనున్నాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి 31 సీట్లు అవసరం. దీంతో మిత్రపక్షాలతో సమావేశం నిర్వహిస్తున్నారు. కాగా, ఇండియా కూటమి సైతం ఇవాళ ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తోంది. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 39 స్థానాలు అనివార్యం. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు తీసుకునే నిర్ణయాలపైనా ఆసక్తి నెలకొంది.
Chandrababu Pawan Kalyan ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు ?
ఎన్డీఏకు కన్వీనర్ గా చంద్రబాబును నియమించాలని కూడా బీజేపీ పెద్దలు భావించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎన్డీఏ కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టాలని ప్రధాని మోదీ.. చంద్రబాబును ఫోన్ ద్వారా కోరగా.. తాను ఆలోచించి చెబుతానని 48 గంటలు సమయం ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లు వార్తలు వస్తున్నాయి.ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు ఉండడం ద్వారా కూటమిలోకి ఇతర పార్టీలను చేర్చుకోవడంలో బాబు అనుభవం పనికివస్తుందని అంటున్నారు. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్నవారు ఉంటే ఎన్డీఏ కూటమికి మేలు చేకూరుతుందని భావిస్తున్నారు. పైగా అటు ఇండియా కూటమి కూడా 230కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండడం.. ఇతరులు మరో 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండడంతో ఎన్డీఏ కూటమి ఆచితూచి వ్యవహరిస్తోంది.