Delhi Exit Polls 2025 : ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌పై అందరి దృష్టి.. గతంలో ఎప్పుడు నిజం అయ్యాయి..!
Delhi Exit Polls 2025 : గత కొన్ని నెలల నుంచి సాగుతున్న ఢిల్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఢిల్లీ ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు కాగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన సర్వేలు ఏం చెబుతాయి అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు జరుగుతుండగా.. ప్రముఖంగా మాత్రం ఆప్-బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నయి. 27 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరమైన BJP బీజేపీ.. తిరిగి సీఎం కుర్చీని దక్కించుకోవాలని చూస్తుండగా.. ఆప్ హ్యాట్రిక్ కొట్టాలని బలంగా కోరుకుంటోంది.
Delhi Exit Polls 2025 : ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌పై అందరి దృష్టి.. గతంలో ఎప్పుడు నిజం అయ్యాయి..!
గతంలో ఎగ్జిట్ పోల్స్ ఎంత వరకు నిజం అయ్యాయి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2020లో సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దగ్గరగా వచ్చాయి. అయినా ఆప్ సీట్ల సంఖ్యను తక్కువగా అంచనా వేశాయి. సగటున ఎనిమిది సర్వేలు ఆప్‌కి 54 సీట్లు, బీజేపీకి 15 సీట్లు వస్తాయని అంచనా వేయగా..ఆప్ 62 సీట్లు గెలుచుకుంది, అప్పట్లో 8 ఎగ్జిట్ పోల్స్‌లో 5 ఫలితాలు నిజం కావడం మనం చూశాం. ఇక2015లో జరిగిన ఎన్నికల్లో చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఆప్ విజయాన్ని అంచనా వేసినప్పటికీ అది అంత ప్రభావం చూపలేదుఏ. ఆప్ దాదాపు 45 సీట్లు సాధిస్తుందని అంచనా వేయగా.. ఆప్ 67 సీట్లు గెలిచింది.
బీజేపీ 24, కాంగ్రెస్ ఒకటి గెలుస్తుందని పోల్స్ అంచనా వేస్తే.. వాస్తవానికి బిజెపికి కేవలం మూడు సీట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా రాలేదు. అలాగే ఆప్ 60 సీట్ల మార్కును దాటుతుందని ఏ పోల్ ఊహించలేదు. కేవలం యాక్సిస్ మై ఇండియా పోల్ మాత్రమే 53 సీట్లను అంచనా వేసి 50కి మించి ఉంటుందని తెలిపింది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీ శాసనసభకు ఇవాళ ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అన్ని పార్టీల నుంచి 699 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఢిల్లీ ఎన్నికల పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హోమ్ ఓటింగ్ సౌకర్యం కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు
Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…
Good News : భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…
Sugarcane Juice : వేసవి వేడి శక్తిని హరించడం ప్రారంభించినప్పుడు, ప్రకృతి దాని రిఫ్రెషింగ్ విరుగుడు - చెరుకు రసాన్ని…
Funeral : హిందూ సంప్రదాయంలో మాత్రమే కాదు, ఇతర మత సంప్రదాయంలో కూడా మనిషి చివరి జర్నీ పలు రకాల…
Fingernails Health : మీ వేలి గోళ్లు వాటి రంగు, ఆకారం, ఆకృతి ద్వారా మీ ఆరోగ్య స్థితికి సూచనలను…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని జూన్ 2న ప్రారంభిస్తామని రెవెన్యూ…
High Protein Vegetables : మీ జుట్టు నుండి కండరాల వరకు అనేక శరీర భాగాలకు ప్రోటీన్ ముఖ్యమైనది మరియు…
Chandrababu : ఏపీ కేబినెట్ AP Cabinet ఈరోజు (గురువారం) CM Chandrababu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది.…
This website uses cookies.