Delhi Exit Polls 2025 : ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌పై అంద‌రి దృష్టి.. గ‌తంలో ఎప్పుడు నిజం అయ్యాయి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Delhi Exit Polls 2025 : ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌పై అంద‌రి దృష్టి.. గ‌తంలో ఎప్పుడు నిజం అయ్యాయి..!

 Authored By ramu | The Telugu News | Updated on :5 February 2025,9:04 pm

ప్రధానాంశాలు:

  •  Delhi Exit Polls 2025 : ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌పై అంద‌రి దృష్టి.. గ‌తంలో ఎప్పుడు నిజం అయ్యాయి..!

Delhi Exit Polls 2025 : గత కొన్ని నెలల నుంచి సాగుతున్న ఢిల్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఢిల్లీ ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు కాగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన సర్వేలు ఏం చెబుతాయి అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు జరుగుతుండగా.. ప్రముఖంగా మాత్రం ఆప్-బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నయి. 27 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరమైన BJP బీజేపీ.. తిరిగి సీఎం కుర్చీని దక్కించుకోవాలని చూస్తుండగా.. ఆప్ హ్యాట్రిక్ కొట్టాలని బలంగా కోరుకుంటోంది.

Delhi Exit Polls 2025 ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌పై అంద‌రి దృష్టి గ‌తంలో ఎప్పుడు నిజం అయ్యాయి

Delhi Exit Polls 2025 : ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌పై అంద‌రి దృష్టి.. గ‌తంలో ఎప్పుడు నిజం అయ్యాయి..!

Delhi Exit Polls 2025 ఎగ్జిట్ పోల్స్‌పైనే ఆస‌క్తి..

గ‌తంలో ఎగ్జిట్ పోల్స్ ఎంత వ‌ర‌కు నిజం అయ్యాయి అనేది కూడా ఇప్పుడు చర్చ‌నీయాంశంగా మారింది. 2020లో సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దగ్గరగా వచ్చాయి. అయినా ఆప్ సీట్ల సంఖ్యను తక్కువగా అంచనా వేశాయి. సగటున ఎనిమిది సర్వేలు ఆప్‌కి 54 సీట్లు, బీజేపీకి 15 సీట్లు వస్తాయని అంచనా వేయగా..ఆప్ 62 సీట్లు గెలుచుకుంది, అప్పట్లో 8 ఎగ్జిట్ పోల్స్‌లో 5 ఫలితాలు నిజం కావ‌డం మ‌నం చూశాం. ఇక‌2015లో జరిగిన ఎన్నికల్లో చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఆప్ విజయాన్ని అంచనా వేసినప్పటికీ అది అంత ప్ర‌భావం చూప‌లేదుఏ. ఆప్ దాదాపు 45 సీట్లు సాధిస్తుందని అంచనా వేయగా.. ఆప్ 67 సీట్లు గెలిచింది.

బీజేపీ 24, కాంగ్రెస్ ఒకటి గెలుస్తుందని పోల్స్ అంచనా వేస్తే.. వాస్తవానికి బిజెపికి కేవలం మూడు సీట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా రాలేదు. అలాగే ఆప్ 60 సీట్ల మార్కును దాటుతుందని ఏ పోల్ ఊహించలేదు. కేవలం యాక్సిస్ మై ఇండియా పోల్ మాత్రమే 53 సీట్లను అంచనా వేసి 50కి మించి ఉంటుందని తెలిపింది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీ శాసనసభకు ఇవాళ ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అన్ని పార్టీల నుంచి 699 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఢిల్లీ ఎన్నికల పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,766 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యం కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది