Insta Reel : ఇన్‌స్టాగ్రామ్ రీల్ తెచ్చిన తంటా.. వరంగల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. వీడియో
ప్రధానాంశాలు:
Insta Reel : ఇన్‌స్టాగ్రామ్ రీల్ తెచ్చిన తంటా.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..!
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు, బాలిక మధ్య చోటుచేసుకున్న రొమాంటిక్ సన్నివేశాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకోవడంతో, రెండు వర్గాల మధ్య తీవ్ర వివాదం తలెత్తింది.ఈ వీడియోపై ఇద్దరు కుటుంబాల మధ్య మొదలైన మాటల యుద్ధం ఘర్షణగా మారింది. వివరాల్లోకి వెళ్తే, ఇద్దరు మైనర్లు తమ మధ్య ముద్దుపెట్టుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, ఇది కుటుంబ సభ్యుల దృష్టికి వెళ్లింది.

Insta Reel : ఇన్‌స్టాగ్రామ్ రీల్ తెచ్చిన తంటా.. వరంగల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ
Insta Reel : ఇన్‌స్టా వలన..
పరువు నష్టం, ఆగ్రహం నేపథ్యంలో వారు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది.ఈ ఘర్షణలో సుమారు 50 మంది యువకులు, మహిళలు పాల్గొన్నారు. వారంతా మారణాయుధాలు, కర్రలు, రాడ్లతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం మరింత పెరగకుండా పోలీసులు వేగంగా స్పందించి ఇరుపక్షాల సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.పిల్లల అభివృద్ధికి, భద్రతకు నిఘా వేదికలు కావాల్సిన సోషల్ మీడియా ఇలా సమస్యలకు కేంద్రంగా మారుతుండడం కలవరానికి గురి చేస్తోంది. పోలీసులు తల్లిదండ్రులకు, యువతకు సోషల్ మీడియా వినియోగంపై బాధ్యతతో వ్యవహరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
కొంపముంచిన @instagram రీల్.!
వరంగల్ కొత్త వాడకు చెందిన మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటు తీసుకున్న ఓ రీల్ వైరల్ కావడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ..
ఘర్షణలో రెచ్చిపోయిన సుమారు 50 మంది యువకులు, మహిళలు..
యువకుల చేతుల్లో మారణాయుధాలు.. ఘర్షణలో పలువురికి గాయాలు..
పోలీసుల అదుపులో… pic.twitter.com/pkbpYiRnA5
— Telugu Reporter (@TeluguReporter_) July 5, 2025