Good News : గ్రామీణ ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Good News : గ్రామీణ ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 July 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  గ్రామీణ యువత కు గొప్ప అవకాశం..రూ.10 నుండి 15 లక్షల రుణం ఇవ్వబోతున్న కేంద్ర సర్కార్

  •  గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయ ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా రుణం

Good News : గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయ ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (National Livestock Mission) పేరుతో ఓ కీలక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా పశుపాలన, పౌల్ట్రీ, గోట్ ఫార్మింగ్ వంటి రంగాల్లో యూనిట్ స్థాపన కోసం రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు సబ్సిడీని అందించనున్నారు. ముఖ్యంగా యువత, వ్యవసాయ కుటుంబాల సంతతి, మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

Good News గ్రామీణ ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్

Good News : గ్రామీణ ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్..!

Good News రూ.10 నుండి 15 లక్షల రుణం ఇవ్వబోతున్న కేంద్ర సర్కార్

ఈ పథకం కింద పాడి పశువులు, గుడ్లకోళ్లు, మేకల పెంపకం, మాంసాహార పశుపాలనకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటుకు సబ్సిడీని అందిస్తారు. వ్యవసాయంతోపాటు పశుపోషణతో కూడిన ఆదాయ మార్గాలను రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వం మొత్తం పెట్టుబడిలో 50 నుంచి 60 శాతం వరకు సబ్సిడీని మంజూరు చేస్తోంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇది ఉపయోగపడనుంది.

ఈ పథకానికి దరఖాస్తు చేయాలనుకునే వారు https://nlm.udyamimitra.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్యుమెంట్లు, బిజినెస్ ప్లాన్, ఆధార్, బ్యాంక్ వివరాలు తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సంబంధిత డిస్ట్రిక్ట్ లైవ్‌స్టాక్ ఆఫీసర్ ఆమోదం తర్వాత బ్యాంక్ నుండి రుణం మంజూరు అవుతుంది. కేంద్రం ప్రకటించిన ఈ పథకం ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే నమ్మకం ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది