Good News : గ్రామీణ ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్..!
Good News : గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయ ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (National Livestock Mission) పేరుతో ఓ కీలక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా పశుపాలన, పౌల్ట్రీ, గోట్ ఫార్మింగ్ వంటి రంగాల్లో యూనిట్ స్థాపన కోసం రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు సబ్సిడీని అందించనున్నారు. ముఖ్యంగా యువత, వ్యవసాయ కుటుంబాల సంతతి, మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
Good News : గ్రామీణ ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్..!
ఈ పథకం కింద పాడి పశువులు, గుడ్లకోళ్లు, మేకల పెంపకం, మాంసాహార పశుపాలనకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటుకు సబ్సిడీని అందిస్తారు. వ్యవసాయంతోపాటు పశుపోషణతో కూడిన ఆదాయ మార్గాలను రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వం మొత్తం పెట్టుబడిలో 50 నుంచి 60 శాతం వరకు సబ్సిడీని మంజూరు చేస్తోంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇది ఉపయోగపడనుంది.
ఈ పథకానికి దరఖాస్తు చేయాలనుకునే వారు https://nlm.udyamimitra.in వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్యుమెంట్లు, బిజినెస్ ప్లాన్, ఆధార్, బ్యాంక్ వివరాలు తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సంబంధిత డిస్ట్రిక్ట్ లైవ్‌స్టాక్ ఆఫీసర్ ఆమోదం తర్వాత బ్యాంక్ నుండి రుణం మంజూరు అవుతుంది. కేంద్రం ప్రకటించిన ఈ పథకం ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే నమ్మకం ఉంది.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.