Gudlavalleru : గుడ్లవల్లేరులో రాత్రికి రాత్రి ఏం జరిగింది.. నిందితులని ఎవరు తప్పించారు..!
Gudlavalleru : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ బాత్‌రూమ్‌లలో విద్యార్థినుల రహస్య చిత్రీకరణ అంశం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ వ్యవహారంలో తవ్వే కొద్ది విస్తుబోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. బిటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి తన స్నేహితురాలితో కలిసి చేసిన చేష్టలతో విద్యార్థినులు బెంబేలెత్తిపోయారు. ఈ విషయం తెలియగానే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గురువారం రాత్రంతా నిరసనలకు దిగారు. క్యాంపస్‌లో బైఠాయించారు. న్యాయం చేయాలంటూ నినదించారు. విద్యార్థుల […]
ప్రధానాంశాలు:
Gudlavalleru : గుడ్లవల్లేరులో రాత్రికి రాత్రి ఏం జరిగింది.. నిందితులని ఎవరు తప్పించారు..!
Gudlavalleru : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ బాత్‌రూమ్‌లలో విద్యార్థినుల రహస్య చిత్రీకరణ అంశం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ వ్యవహారంలో తవ్వే కొద్ది విస్తుబోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. బిటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి తన స్నేహితురాలితో కలిసి చేసిన చేష్టలతో విద్యార్థినులు బెంబేలెత్తిపోయారు. ఈ విషయం తెలియగానే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గురువారం రాత్రంతా నిరసనలకు దిగారు. క్యాంపస్‌లో బైఠాయించారు. న్యాయం చేయాలంటూ నినదించారు. విద్యార్థుల ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, నినదాలతో ఇంజినీరింగ్ కళాశాల మార్మోగిపోయింది.
Gudlavalleru సూత్రధారులు ఎవరు చేశారు.!
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్‌కు చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒక విద్యార్థిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలంటూ బాధిత విద్యార్థినులు డిమాండ్ చేస్తోన్నారు. హాస్టల్ బాత్‌రూమ్‌లల్లో హిడెన్ కెమెరాలను అమర్చడం ద్వారా సుమారు 300 మంది వరకు విద్యార్థినుల వీడియోలను నిందితులు సేకరించారని, వాటిని డార్క్ వెబ్‌సైట్లల్లో విక్రయించారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేస్తోన్నారు.
కొద్ది రోజుల క్రితం ఈ వీడియోలు కాలేజీ విద్యార్థుల మధ్య సర్క్యూలేట్ అయ్యాయి. దీంతో గత వారం కాలేజీ యాజమాన్యానికి విద్యార్ధులు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని సామాజిక వర్గానికి చెందిన యువకులు యువకుడిపై దాడి చేయడంతో ఈ వ్యవహారం మొదట బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యం ఈ వ్యవహారాన్ని తొక్కి పెట్టింది. ఆ తర్వాత ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని గట్టిగా నిలదీయడంతో బాత్‌రూమ్‌లలో రహస్య కెమెరాల అంశం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. తన స్నేహితురాలి సహకారంతో వీడియోలను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. బాత్‌రూమ్‌లలో రికార్డ్ చేసిన వీడియోలలో ఇతర విద్యార్థినులు ఉన్నారని అనుమానించి కాలేజీ యజామాన్యానికి ఫిర్యాదు చేశారు. యువతితో ఉన్న వీడియోలు హాస్టల్ గదిలో ఉంటున్న ఇతర విద్యార్థులకు ఈ వీడియోలు చిక్కడంతో బయటకు పొక్కింది.