Chandrababu : ముందస్తు ఎన్నికలు అని ఎగురుతోన్న చంద్రబాబుకి నమ్మలేని న్యూస్ చెప్పిన కేంద్ర ఎన్నికల సంఘం..!
Chandrababu : ఏపీలో త్వరలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే అక్టోబర్ నెలలో సీఎం జగన్ ఏపీ అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణ ఎన్నికల సమయానికే ఎన్నికలకు వెళ్తారు అనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయి అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అసలు జగన్ ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం ఏంటి అనేది ఎవ్వరూ ఆలోచించడం లేదు. నిజంగానే ఏపీలో ముందస్తు రాబోతున్నాయి అన్న రేంజ్ లో ప్రస్తుతం రాజకీయాలు నడుస్తున్నాయి.
కానీ.. ఏపీలో ముందస్తు ఎన్నికలు అనేవి జరగవు. ఆ చాన్సే లేదు. అసలు సీఎం జగన్ ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలి. అవసరం ఏంటి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏపీలో గెలిచేది వైసీపీ పార్టీనే. అందులో నో డౌట్. దానికి ముందస్తు ఎన్నికలు ఎందుకు. కానీ.. ఏపీలో ముందస్తు ఎన్నికలు అని అసత్యపు ప్రచారాలు చేస్తోంది ఎవరో కాదు.. సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు. కావాలని ఆయన చేస్తున్న ప్రచారం అది.
Chandrababu : ఏడాది నుంచి ముందస్తు ఎన్నికల పాట పాడుతున్న చంద్రబాబు
ఇప్పుడు కాదు.. ఒక ఏడాది నుంచి చంద్రబాబు ముందస్తు ఎన్నికల పాట పాడుతున్నారు. టీడీపీ క్యాడర్ ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటున్నారు. ముందస్తు ఎన్నికలపై పలు వేదికల మీద కూడా చెప్పుకొచ్చారు. అందుకే పొత్తుల కోసం ఢిల్లీకి వెళ్లి అక్కడ మంతనాలు జరిపారు. హడావుడి చేస్తున్నారు. కావాలని వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లడం కోసం చంద్రబాబు చేస్తున్న అబద్ధపు ప్రచారాలు, అనవసర హడావుడి ఇది. టీడీపీ నేతలు ఎక్కడ వేరే పార్టీకి జంప్ కొడతారో అని చంద్రబాబు ఇప్పటి నుంచే అంతలా హడావుడి చేస్తున్నారు కానీ.. ఏపీలో ముందస్తు ఎన్నికలు అనేది జరగడం కష్టం అని విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.