Ys Jagan : కీలక IAS జగన్ పార్టీ లోకి – కీలక MP స్థానం ఖరారు చేసిన జగన్ !
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చాలా సర్వేల ఫలితాలు తెలియజేస్తున్నాయి. కష్ట సమయాలలో సైతం సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంక్షేమ పథకాలు అందిస్తుండటంతో ప్రజలు మరోసారి వైసీపీ పార్టీకే అధికారం ఇవ్వబోతున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే సమయంలో తన పరిపాలనలో మంచి జరిగితేనే తనకు ఓటు వేయాలని చాలా ధీమాగా జగన్ బహిరంగ సభలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరిణామంతో వైసిపి పార్టీలోకి ఇటీవల చాలామంది జాయిన్ అవుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన కీలక నాయకులు వైసీపీలోకి వస్తున్నారు.
ఇలాంటి తరుణంలో కీలక ఐఏఎస్ జగన్ పార్టీలోకి రావడానికి రెడీ అయినట్లు ఆయనకి ఎంపి స్థానాన్ని జగన్ ఖరారు చేసినట్లు ఏపీ రాజకీయాల్లో వార్త వైరల్ అవుతుంది. పూర్తి విషయంలోకి వెళ్తే కలెక్టర్ గా ఇంకా పలు కీలక శాఖలకు సెక్రటరీగా పనిచేసిన విజయ్ కుమార్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. వాలంటీర్లు వ్యవస్థ కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటు విద్యాశాఖలో మార్పులు తీసుకురావడంలో వైసీపీ ఆధ్వర్యంలో.. విజయ ఎస్ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి డిసైడ్ కావడంతో ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సెక్రటరీ పదవికి రాజీనామా కూడా చేయడం జరిగింది. అయితే రాజకీయాల్లో పూర్తిగా జగన్ తో కలిసి నడవాలని ఆలోచనతో విజయ్ కుమార్.. స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి నిర్ణయం తీసుకున్నారట.
పార్టీలో జాయిన్ అవ్వకముందే తడా నుంచి తుని వరకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. దళిత గిరిజన బీసీ మైనార్టీ వర్గాలను కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాను కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నెల్లూరు ఒంగోలు విజయవాడలో దళిత గిరిజనులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీరందరిని ఒక తాటి పైకి తీసుకురావడానికి తన వంతుగా ఐక్యత విజయపథం అనే యాత్ర.. విజయకుమార్ ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలో బాపట్ల లేదా తిరుపతి నుంచి విజయ్ కుమార్ నీ పార్లమెంటు స్థానానికి పోటీ చేయించడానికి జగన్ కూడా రెడీ అయినట్లు సమాచారం.