Donald Trump : ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఎవరిపై అంటే..!
ప్రధానాంశాలు:
Donald Trump : ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఎవరిపై అంటే..!
Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్, మరోసారి వలసదారులపై దృష్టిసారించారు. “గ్రేట్ అమెరికా మేక్ ఎగైన్” నినాదంతో ముందుకు సాగుతున్న ఆయన, అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ మేరకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం, అక్రమ వలసదారులకు స్వీయ బహిష్కరణకు అవకాశం ఇవ్వడంతో పాటు, పాటించకపోతే భారీ జరిమానాలు, ఆస్తుల జప్తు, జైలు శిక్ష వంటి కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేసింది. సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్ ద్వారా దేశం వీడితే మినహాయింపు ఉండగా, దాన్ని ఉపయోగించకుండా పట్టుబడితే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.

Donald Trump : ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఎవరిపై అంటే..!
Donald Trump : ట్రంప్ తాజా నిర్ణయం తో అల్లాడిపోతున్న అక్రమ వలసదారులు
ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అమెరికాలోని 1.1 కోట్లకు పైగా ఉన్న అక్రమ వలసదారుల జీవనంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. వ్యవసాయం, నిర్మాణ రంగం, సేవా రంగాల్లో కీలకంగా ఉన్న వలసదారులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. రోజుకు సుమారు రూ.86,000 జరిమానా విధించడం, ఆస్తుల జప్తు వంటి చర్యలతో వలసదారులలో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉండగా, మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ట్రంప్ తీసుకున్న చర్యలపై అంతర్జాతీయంగా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెక్సికో, లాటిన్ అమెరికా దేశాలు తమ పౌరుల రక్షణ కోసం శిబిరాలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టాయి. ఈ విధానాల వల్ల అమెరికా-ఇతర దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. ఒకవైపు అమెరికా భద్రత పేరుతో వీటిని న్యాయసమ్మతంగా చెప్పుకుంటున్నప్పటికీ, మరొకవైపు ఈ చర్యలు రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకుంటున్నాయని విమర్శకులు పేర్కొంటున్నారు.