Peerzadiguda : పీర్జాదిగూడ నగర పాలక సంస్థలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి & రోడ్ పనుల ప్రారంభోత్సవం…!
ప్రధానాంశాలు:
Peerzadiguda : పీర్జాదిగూడ నగర పాలక సంస్థలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి & రోడ్ పనుల ప్రారంభోత్సవం...!
Peerzadiguda : పీర్జాదిగూడ నగర పాలక సంస్థ 2వ డివిజన్ లోని ధరణీ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు రోడ్ పనులను మాజీ మేయర్ అమర్ సింగ్ హాజరై ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనులు కాలనీవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలను అందించడమే లక్ష్యంగా చేపట్టబడింది.

Peerzadiguda : పీర్జాదిగూడ నగర పాలక సంస్థలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి & రోడ్ పనుల ప్రారంభోత్సవం…!
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సుభాష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పప్పుల అంజిరెడ్డి,బండారి రవీందర్,యాసారం మహేష్,తవిటి ప్రశాంత్,మాజీ కో ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు శ్రీలత, కాలనీ వాసులు, మహిళలు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మేయర్ అమర్ సింగ్ మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడంతో కాలనీవాసులకు తగినంత డ్రైనేజీ సదుపాయం లభించడంతో పాటు రహదారి సౌకర్యాలు మెరుగవుతాయి. ప్రజలకు మౌలిక వసతులను అందించడమే మా ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు, కాలనీవాసులు అభివృద్ధి పనులను అభినందిస్తూ, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.