Peerzadiguda : శరవేగంగా పీర్జాదిగూడ పర్వతాపూర్ రోడ్డు విస్తరణ పనులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Peerzadiguda : శరవేగంగా పీర్జాదిగూడ పర్వతాపూర్ రోడ్డు విస్తరణ పనులు..!

 Authored By ramu | The Telugu News | Updated on :12 April 2025,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Peerzadiguda : శరవేగంగా పీర్జాదిగూడ పర్వతాపూర్ రోడ్డు విస్తరణ పనులు..!

Peerzadiguda : పీర్జాదిగూడ- పర్వతాపూర్ ప్రధాన రహదారి విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. విస్తరణలో భాగంగా పలు విద్యుత్ స్తంభాలను తొలగించడం,విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ల రీప్లేస్మెంట్ పనులను సంబంధిత అధికారుల సమక్షంలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నత్తనడక నడిచిన రోడ్డు విస్తరణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శరవేగంగా చురుకుగా సాగుతున్నాయని.

Peerzadiguda శరవేగంగా పీర్జాదిగూడ పర్వతాపూర్ రోడ్డు విస్తరణ పనులు

Peerzadiguda : శరవేగంగా పీర్జాదిగూడ పర్వతాపూర్ రోడ్డు విస్తరణ పనులు..!

Peerzadiguda : పనులను పర్యవేక్షించిన తుంగతుర్తి రవి

పీర్జాదిగూడ పర్వతాపూర్ ప్రజల సౌకర్యార్థం వర్షాకాలం రాకముందే పనులు పూర్తి చేసే విధంగా అధికారులు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ నాణ్యతలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు తుంగతుర్తి రవి ఆదేశించారు అలాగే ఈ తాటి చెట్ల తొలిగింపునకు సహకరించిన గౌడ సంఘం నాయకులకు, మున్సిపల్ సిబ్బంది కి కృతజ్ఞతలు తెలియజేసారు.

Peerzadiguda ఈ కార్యక్రమంలో

DE లింగయ్య, AE సత్యనారాయణ రెడ్డి,లైన్మెన్ భాస్కర్,మున్సిపల్ అధికారులు,మున్సిపల్ సిబ్బంది,స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు,గౌడ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది