Peerzadiguda : పీర్జాదిగూడ ఘనంగా రిధి డెంటల్ క్లినిక్ రెండవ వార్షికోత్సవం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Peerzadiguda : పీర్జాదిగూడ ఘనంగా రిధి డెంటల్ క్లినిక్ రెండవ వార్షికోత్సవం..!

 Authored By ramu | The Telugu News | Updated on :9 July 2025,10:00 pm

ప్రధానాంశాలు:

  •  ముఖ్య అతిథులగా మాజీ మేయర్ అమర్ సింగ్,

  •  Peerzadiguda : పీర్జాదిగూడ ఘనంగా రిధి డెంటల్ క్లినిక్ రెండవ వార్షికోత్సవం..!

Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ రామ్ చంద్ కాలనీ పర్వతాపూర్ లో రిధి డెంటల్ క్లినిక్ రెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మేయర్ అమర్ సింగ్ కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, సమాజానికి వైద్య సేవలందించడంలో డెంటల్ క్లినిక్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

Peerzadiguda పీర్జాదిగూడ ఘనంగా రిధి డెంటల్ క్లినిక్ రెండవ వార్షికోత్సవం

Peerzadiguda : పీర్జాదిగూడ ఘనంగా రిధి డెంటల్ క్లినిక్ రెండవ వార్షికోత్సవం..!

Peerzadiguda కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొడిగె కృష్ణ గౌడ్

ఈ సందర్భంగా క్లినిక్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత డెంటల్ మరియు మెడికల్ చెక్‌అప్ శిబిరం నిర్వహించారు. ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంచే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు అభినందించారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ పలువురు ఈ శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు.

క్లినిక్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన దంత చికిత్సలతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇకపై తరచుగా నిర్వహించనున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో యాసారం మహేష్, మేడిపల్లి హనుమాన్ టెంపుల్ చైర్మన్ రామ్ రెడ్డి, మేడిపల్లి మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు చిలుముల అజయ్ రెడ్డి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, క్లినిక్ సిబ్బంది మరియు ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది