India : నిజ్జర్ హత్యపై కెనడా మీడియా చెత్త కథనం.. పూర్తిగా ఖండించిన భారత్..!
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు పథకం పన్నిన విషయం ప్రధాని నరేంద్ర మోడీకి తెలుసంటూ కెనడియన్ మీడియా కథనాలు ప్రచారం చేసింది. ఇందులో నిజ్జర్ హత్య కుట్ర కేంద్ర హోం మంత్రి అమిత్ షా కనుసన్నలలో జరిగిందని.. ప్రధాని మోడీ తో పాటు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లకు ప్లాన్ గురించి సమాచారం అందిందని సదరు కెనడియన్ ప్రభుత్వ వార్త పత్రిక ఆరోపించింది. ఈ కథనంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఓ ప్రకటన విడుదల చేస్తూ, ”సాధారణంగా మేం వార్తా కథనాలపై స్పందించబోం.
India : నిజ్జర్ హత్యపై కెనడా మీడియా చెత్త కథనం.. పూర్తిగా ఖండించిన భారత్..!
అయితే, కెనడా ప్రభుత్వ వర్గాలకనుసంధానంగా వచ్చిన ఈ అవాస్తవ కథనాలను ఖండిస్తున్నాం. ఇలాంటి దుష్ప్రచారాలు భారత్-కెనడా సంబంధాలను మరింత దిగజారుస్తాయి”అని తెలిపారు.గతేడాది, ఖలిస్థానీ అనుకూలవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వానికి సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో భారత్-కెనడా దౌత్య సంబంధాలు బాగా దెబ్బ తిన్నాయి. అంతేకాక, నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చడంతో పరిస్థితి మరింత జటిలమైంది. ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం తమ దేశంలోని కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించి, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
ప్రధాని మోడీకి వ్యతిరేకంగా చేసిన ఈ వాదనకు కెనడా వద్ద ఎలాంటి ఆధారాలు లేవని నివేదికలో తెలిపింది. మిస్టర్ మోడీకి తెలిసినట్లు కెనడా దగ్గర ప్రత్యక్ష సాక్ష్యం లేనప్పటికీ.. భారతదేశంలోని ముగ్గురు సీనియర్ రాజకీయ ప్రముఖులు ఆయనతో ఈ హత్యల గురించి చర్చించకపోవడమే ఊహించలేనిదని కెనడియన్ అధికారి ఒకరు చెప్పారు. భారతీయులు అత్యధికంగా వున్న దేశాల్లో కెనడా ఒకటి. అలాంటి దేశంలో దేశ దౌత్య సంబంధాలు రోజురోజుకు మరింత క్షీణిస్తున్నాయి. సిక్కు వేర్పాటువాది, ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు … ఇది భారత్ పనే అని కెనడా ఆరోపిస్తోంది. తమ దేశ పౌరసత్వం కలిగిన నిజ్జర్ హత్యను కెనడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ హత్య ఇరు దేశాల మధ్య చిచ్చురేపింది.
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
This website uses cookies.