కరోనా పరీక్షల..? ఇంటర్ పరీక్షల..? అల్లాడిపోతున్న ఆంధ్ర బిడ్డలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

కరోనా పరీక్షల..? ఇంటర్ పరీక్షల..? అల్లాడిపోతున్న ఆంధ్ర బిడ్డలు

 Authored By brahma | The Telugu News | Updated on :2 May 2021,3:28 pm

50 ఏళ్ల పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఎంత కష్టమైన సరే పరీక్షలు నిర్వహించటానికి మేము సిద్ధం అవుతున్నామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించాడు. కానీ కష్టం ప్రభుత్వానికి కంటే కూడా ఇంటర్ చదువుతున్న పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఎక్కువగా ఉంది. కరోనా కష్ట కాలంలో అనేక భయాల నడుమ, పూర్తికాని సిలబస్ మధ్యలో ఎలా పరీక్షలు రాయాలి భగవంతుడా అని ఆలోచిస్తున్న పిల్లలకు మరో ఇబ్బంది వచ్చి పడింది.

BIEAP releases AP Inter Hall tickets 2021 for 1st and 2nd-year students at bie.ap.gov.in, check direct link here

ఇంటర్ పరీక్ష రాయాలంటే కరోనా నెగిటివ్ వచ్చిన రిపోర్ట్ చూపించాలని ప్రభుత్వం చెప్పింది. ఆ రిపోర్ట్ ఉంటేనే కళాశాలలు హాల్ టిక్కెట్ ఇస్తాయి. దీనితో పిల్లలను తీసుకోని వాళ్ళ తల్లిదండ్రులు కరోనా టెస్ట్ ల కోసం పరుగులు తీస్తున్నారు. కానీ అక్కడ పరీక్షలు చేసే బృందం మాత్రం కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళకి మాత్రమే పరీక్షలు చేస్తామని చెప్పటంతో ఏమి చేయాలో అర్ధం కాక పిల్లలు వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు.

తాజాగా ప్రకాశం జిల్లాలోని కనిగిరి కమ్యూనిటీ వైద్యశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులకు వైద్య సిబ్బందికి వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంటర్ పరీక్షలు మే 5 నుంచి ప్రారంభమవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని విజయవాడ గుంటూరు తదితర ప్రాంతాల్లో చదువుకునే కనిగిరి ప్రాంత విద్యార్థులు  ఇటీవల స్వస్థలానికి వచ్చారు. పరీక్షల దృష్ట్యా కోవిడ్ ధ్రువీకరణ పత్రాలు ఆయా కళాశాలల యాజమాన్యాలకు అందజేయాల్సి ఉంది. దీంతో నిర్ధారణ కోసం 20 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు కనిగిరి పీహెచ్సీ వద్దకు వచ్చారు. కానీ కోవిడ్ పరీక్షలు చేయడం లేదని వైద్య సిబ్బంది తెలియడంతో వారంతా ఆందోళనకు దిగారు.

నిర్ధారణ పరీక్షలు చేయకుంటే మా పిల్లలను పరీక్షలు రాయనీయరు అంటూ వైద్య సిబ్బందితో విద్యార్థుల తల్లిదండ్రులు గొడవకు దిగారు. దీంతో పీహెచ్సీ వైద్యులు వెనక్కి తగ్గి మే 3న విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ లక్షణాలు లేని వారికి చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయని అందుకే టైం ఇవ్వాలని కోరడంతో విద్యార్థులు ఆందోళన విరమించి వెళ్లిపోయారు. ఇలా ఏపీలో ఇంటర్ పరీక్షల్లో కోవిడ్ లేదని చూపాలనే సర్టిఫికెట్లు ఇప్పుడు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. చదువుకునే టైంలో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన దారుణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అసలే కరోనా టైంలో ఇలా తిరిగితే విద్యార్థులకు ఏమైనా అయితే ఎవరు బాధ్యులు అని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది