Reddy Community : వైసీపీ ఓటమికి కారణం రెడ్డి సామాజిక వర్గమేనా…!
ప్రధానాంశాలు:
Reddy Community : వైసీపీ ఓటమికి కారణం రెడ్డి సామాజిక వర్గమేనా...!
Reddy Community : రాజకీయంలో రెడ్లు అంటే ఎంతో ప్రాబల్యం ఉన్న వర్గాలు అని అంటారు. ఉమ్మడి ఏపీలో కాని అలాగే విభజన ఏపీలో కానీ కాంగ్రెస్ పార్టీ తమ పలుకుబడిని ఎక్కడ కోల్పోలేదు. ఉమ్మడి ఏపీ లో రెడ్లు కాంగ్రెస్ తో కలిసి పాలిటిక్స్ ని పవర్ ఫుల్ చేశారు. అయితే విభజన తర్వాత కూడా రెడ్లు కాంగ్రెస్ ద్వారా తమ రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవాలని అనుకున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక వారి కోరికలను తీర్చకపోవడంతో తీరని ఆశాభంగం ఎదురయింది అని చెప్పవచ్చు. దీంతో వైసీపీకి వెన్నుముకగా ఉండే రెడ్లు ఎన్నికల సమయంలో ఎదురుదెబ్బ తీశారు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి 11 సీట్లు వచ్చాయి అని అంటున్నారు విశ్లేషకులు. వైసీపీ ని ఏర్పాటు కు 2011 ఎన్నికలలో వీరి వెనక ఉన్న రెడ్లు 2024లో దెబ్బతీశారు. దీనితో రాయలసీమలో నాలుగు జిల్లాల్లోనూ 52 అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీకి దక్కాయి.
అలాగే 2024 లో చూస్తే టీడీపీ మొత్తం సీట్లను గెలుచుకుంది. అక్కడ చూసుకున్నట్లయితే పదికి పది రెడ్లు ప్రభావం గణనీయంగా ఉంది అంటున్నారు. రాయలసీమలో ఎస్సీ రిజర్వేషన్ సీట్లలో కౌన్సిలర్స్ మున్సిపల్ చైర్మన్లు సర్పంచులు ఎంపీటీసీలు లలో రెడ్లు అధిక శాతం పదవుల్లో ఉన్నారు. ఇలా సామాజిక వర్గాల పరంగా చూస్తే రెడ్లు వైసీపీకి మాత్రం ఎందుకు ఓట్లు వేయించి గెలిపించలేదు అనేది ఇప్పుడు చర్చానీయాంశం. అయితే గత ప్రభుత్వం వైసీపీ పాలనలో రెడ్లు సంతృప్తి చెందలేదని తెలుస్తుంది. లోకల్ బాడీస్ లో రెడ్లు గెలిచిన్నప్పటికి రాజకీయ అధికారం సంపాదించినప్పటికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని అంటున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో మొత్తం అసెంబ్లీ సీట్లు 12 ఉండగా అందులో 8 నియోజకవర్గాలలో రెడ్ల ప్రభావం ఉందని అంటున్నారు. వాటితో పాటుగా పల్నాడులో 4 జిల్లాల్లో రెడ్ల ప్రభావం అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు నియోజకవర్గాలలో , గాజువాకలో రెడ్ల ప్రాబల్యం ఉంది అని అంటున్నారు. ఇక మొత్తం చూసుకున్నట్లయితే నెల్లూరు 10, రాయలసీమ 52 ,పల్నాడు 4 , ప్రకాశం 8 ,వైశాఖ 1 ,గోదావరి 2 మొత్తం కలిపితే 72 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెడ్లు రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నారని సమాచారం.
గత ప్రభుత్వంలో వైసీపీ 151 ఎమ్మెల్యేలు 50 కి పైగా రెడ్లు సీట్లను గెలిచారు. ఇలా చూసుకున్నట్లయితే కేబినెట్ లో వారికి 8 నుంచి 10 సీట్లు దాకా రావాల్సి ఉంటుంది. కానీ జగన్ సామాజిక న్యాయమని వారిని పక్కన పెట్టేశారు. వారిని కేవలం 3-4 పోస్టులకే పరిమితం చేశారు. దీంతో రెడ్లు ఫైర్ అయ్యారు వారికి అన్యాయం జరిగింది అని భావించారు. ఒకవేళ కాంట్రాక్టులు ఏమైనా చేసుకోవాలి అనుకున్న సర్కార్ నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా దెబ్బతిన్న రెడ్లు వైసీపీని తెగబడి మరి ఓడించారని అంటున్నారు..మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి…