Prashanth Kishore – Chandrababu : ప్రశాంత్ కిషోర్.. టీడీపీతో కలవడం జగన్ ప్లానా? కావాలని చంద్రబాబును ట్రాప్ చేయిస్తున్నారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prashanth Kishore – Chandrababu : ప్రశాంత్ కిషోర్.. టీడీపీతో కలవడం జగన్ ప్లానా? కావాలని చంద్రబాబును ట్రాప్ చేయిస్తున్నారా?

Prashanth Kishore – Chandrababu : అసలు ఏపీలో ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఏపీలో ఎన్నికలకు ఇంకా 4 నెలల సమయమే ఉంది. ఈనేపథ్యంలో ఏపీ రాజకీయాలు రోజురోజుకూ యూటర్న్ తీసుకుంటున్నాయి. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో వైసీపీకి పని చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీకి పని చేస్తున్నారు. ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల సమయం ఉన్న ఈ పీక్ టైమ్ లో ప్రశాంత్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :24 December 2023,8:00 pm

ప్రధానాంశాలు:

  •  జగన్ ట్రాప్ లో చంద్రబాబు పడ్డారా?

  •  కావాలని చంద్రబాబును జగన్ ప్రశాంత్ కిషోర్ విషయంలో ఇరికిస్తున్నారా?

  •  వైఎస్ జగన్ అసలు ప్లాన్ ఏంటి?

Prashanth Kishore – Chandrababu : అసలు ఏపీలో ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఏపీలో ఎన్నికలకు ఇంకా 4 నెలల సమయమే ఉంది. ఈనేపథ్యంలో ఏపీ రాజకీయాలు రోజురోజుకూ యూటర్న్ తీసుకుంటున్నాయి. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో వైసీపీకి పని చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీకి పని చేస్తున్నారు. ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల సమయం ఉన్న ఈ పీక్ టైమ్ లో ప్రశాంత్ కిషోర్ ను తన టీమ్ లో చేర్చుకున్నారు చంద్రబాబు. చంద్రబాబుతో భేటీ అవ్వడమే కాదు వెంటనే వైసీపీని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. వైసీపీలో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అసలు వైసీపీని కాదని టీడీపీ గెలుపు కోసం పని చేయడానికి ప్రశాంత్ కిషోర్ ఎందుకు వచ్చినట్టు అనేది ఎవ్వరికీ అంతుపట్టడంలేదు. నిజానికి చంద్రబాబు ఈ విషయంలో ఎవ్వరినీ నమ్మరు. అసలు ఈ ఎన్నికలు టీడీపీకి చావో రేవో అన్నట్టుగా ఉన్నాయి. ఈనేపథ్యంలో చంద్రబాబు ఎందుకు ప్రశాంత్ కిషోర్ ను అంత గుడ్డిగా నమ్ముతారు అనే మరో ప్రశ్న కూడా లేవనెత్తుతోంది.

మరోవైపు వైసీపీలో ఉన్న కొన్ని లూప్ హోల్స్ ప్రశాంత్ కు తెలుసు. అది టీడీపీకి ఖచ్చితంగా ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. కానీ.. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంత్ కిషోర్ ను నమ్మకూడదు. ప్రశాంత్ కిషోర్.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గరి వ్యక్తి. జగన్ కు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఆయన పని చేయరు. ఈ విషయంలో చంద్రబాబు కాస్త జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి చంద్రబాబు.. అతడిని నమ్మకూడదు అని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు కోరుతున్నారు.

Prashanth Kishore – Chandrababu : మోదీ ట్రాపా? లేక జగన్ ట్రాపా?

ఏపీలో చంద్రబాబు గెలవకూడదని బీజేపీ కూడా కోరుకుంటోంది. ఏదో పేరుకు టీడీపీతో జతకట్టాలని చూసినా బీజేపీకి వైసీపీ గెలిస్తేనే అనుకూలం. పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ నేరుగానే బీజేపీకి మద్దతు ఇస్తుంది. మోదీకి సపోర్ట్ చేస్తుంది. బీజేపీకి ఎంపీలు తక్కువైనా.. తమ ఎంపీల మద్దతు ప్రకటిస్తుంది. కానీ ఇప్పటికే చంద్రబాబుతో బీజేపీ తెగ తెంపులు చేసుకుంది. ఈనేపథ్యంలో మోదీ కావాలని ప్రశాంత్ కిషోర్ ను చంద్రబాబు దగ్గరికి పంపించారా? లేక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేసిన ట్రాపా? ఇది అనేది అర్థం కావడం లేదు. ఏది ఏమైనా.. ప్రశాంత్ కిషోర్ విషయంలో చంద్రబాబు కాస్త జాగ్రత్తగా ఉండటం మాత్రం చాలా ముఖ్యం.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది