Jamili Election : జమిలి ఎన్నికల పంచాయతీ… విపక్షాలను బీజేపీ ఒప్పిస్తుందా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jamili Election : జమిలి ఎన్నికల పంచాయతీ… విపక్షాలను బీజేపీ ఒప్పిస్తుందా..!

 Authored By aruna | The Telugu News | Updated on :21 January 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Jamili Election : జమిలి ఎన్నికల పంచాయతీ... విపక్షాలను బీజేపీ ఒప్పిస్తుందా..!

Jamili Election : వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదానికి విపక్షాల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. జమిలీ ఎన్నికల సాత్యాసాధ్యాలను పరిశీలించడంతోపాటు వివిధ పార్టీలు మేధావుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నియమించిన కమిషన్ తక్షణమే రద్దు చేయాలంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలి అన్న ఆలోచన నియంతృత పోకడలతో కూడుకున్నది అని పేర్కొన్న ఖర్గే కాంగ్రెస్ పార్టీ జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తుందని అన్నారు. ఇండియా కూటమిలోనే మరికొన్ని పార్టీలు కూడా జమిలి ఎన్నికలను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఇది బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ దురాలోచనే అని విపక్షాలు వర్ణిస్తున్నాయి.కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ నేషన్ వన్ టాక్స్ అంటూ జీఎస్టీ ని తెరపైకి తెచ్చారు. దీనిని విపక్షాలు విమర్శించాయి. ఇక ఇప్పుడు వన్ నేషన్ వన్ కోడ్ అంటున్నారు. దీన్ని కూడా విపక్షాలు విమర్శిస్తున్నాయి. బీజేపీ అనుకూల పార్టీ కాదు అని కొందరు మేధావులు కూడా అంటున్నారు. ఒక దేశంలో ఒకే విధానం ఒకే నిబంధన ప్రతి ఒక్కరికి అమలు కావాలని అంటున్నారు.

వామపక్ష మేధావులు మాత్రం దీని ముసుగులో బీజేపీ మైనారిటీలను మరింతగా వేధిస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక రాజకీయంగాను వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదాన్ని తీసుకొచ్చింది. బీజేపి దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలతో పాటు లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరగాలి అన్నది ఈ నినాదం ఉద్దేశం. దీనికోసం రాజ్యాంగ సవరణ చేయడం కోసం వెనకాడమని బీజేపీ అంటుంది.అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకే సారీ జరుగుతాయని భారతదేశంలో మాత్రం ఎన్నికలు వివిధ రాష్ట్రాల్లో వేరువేరు రోజుల్లో జరుగుతున్నాయని, దీనివలన ఏటా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని ఈ నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడం వలన అభివృద్ధి పథకాల అమలు కష్టమవుతుంది అన్నది బీజేపీ వాదన. ఎప్పుడు ఎక్కడో ఒకచోట ఎన్నికలు ఉండటం వలన ప్రతిదీ రాజకీయం చేయడం ఆనవాయితిగా మారిపోయిందని బీజేపీ భావన. అయితే బీజేపీ వాదనను విపక్షాలు ఖండిస్తున్నాయి. ఇది నిరంకుశ వివాదం అవుతుందని ఈ కుట్రకు మేము సహకరించమని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల్లో సాధ్యసాధ్యులపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారధ్యంలో కమిటీని ఏర్పాటు చేసింది.

దీని కోసమే కోవింద్ వివిధ రాష్ట్రాలలో పర్యటిస్తూ మేధావుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ జమిలి ఎన్నికలను తిరస్కరిస్తున్నామని చెప్పారు. బీజేపీ నియంత్రిత ధోరణికి జమిలీ ఎన్నికలే ఉదాహరణ అని అన్నారు. ఆ తర్వాత మజిలీస్ పార్టీ అధినేత అసిసిద్దిన్ జమిలీ ఎన్నికలను సమర్థించేది లేదని అన్నారు. మెజారిటీ రాష్ట్రాలలో బీజేపీ ఉంది. కాబట్టి ఆ రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు జరిపి స్తే విపక్షాలు కూడా ప్రాంతీయ పార్టీలు వైపు అడుగులు వేయవచ్చాడు అంటున్నారు. ఇక మూడోసారి కూడా నరేంద్ర మోడీ గెలిస్తే జమిలీ ఎన్నికలకు విపక్షాలను ఒప్పించే ప్రయత్నం చేస్తారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది