Bolisetty Srinivas : “రోజా ఆడదా? మగదా? ” అంటూ జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bolisetty Srinivas : “రోజా ఆడదా? మగదా? ” అంటూ జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. వీడియో..!

 Authored By ramu | The Telugu News | Updated on :22 July 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  రోజా పై జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

  •  Bolisetty Srinivas : "రోజా ఆడదా? మగదా? " అంటూ జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. వీడియో..!

Bolisetty Srinivas : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితి రోజురోజుకూ మరింత అపహాస్య స్థాయికి చేరుతోంది. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ, పరస్పర విమర్శలు, బూతులు, దాడులు తగ్గే లక్షణాలు కనిపించడం లేదు. గతంలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీని కూడా అసభ్య పదజాలంతో మంటలెక్కించారు. ప్రత్యేకంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి విషయంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిపై వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి.

Bolisetty Srinivas రోజా ఆడదా మగదా అంటూ జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు వీడియో

Bolisetty Srinivas : “రోజా ఆడదా? మగదా? ” అంటూ జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. వీడియో..!

Bolisetty Srinivas : “రోజా ఆడదో.. మగదో కూడా తెలియదు” జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు

ఈ వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కౌంటర్లతో రంగంలోకి దిగారు. మహిళా కమిషన్ రంగప్రవేశంతో ప్రసన్నకుమార్‌పై కేసులు కూడా నమోదయ్యాయి. ఇదే సమయంలో వైసీపీ కీలక నేత రోజా, కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె మాట్లాడుతూ కూటమి నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని, దీనికి తగిన ప్రతిఫలం వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్‌లను “వీకెండ్ నాయకులు”గా ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలపై తమ శ్రద్ధ లేదంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

రోజా వ్యాఖ్యలపై కూటమి నేతల నుండి తీవ్ర స్పందన వస్తుంది. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ Bolisetty Srinivas ఘాటు పదజాలంతో రోజాను విమర్శిస్తూ, ఆమె మాట్లాడే శైలి అసభ్యంగా ఉందన్నారు. ‘మనం సైలెంట్‌గా ఉంటే ఈ రఫ్పా రఫ్పా గాళ్లంతా రోడ్లెక్కి మాట్లాడుతుంటే మనమంతా ఎక్కడ ఉన్నామో అర్ధం కావడం లేదు. ఎమ్మెల్యే నా కొడుకులట.. రోజా మాట్లాడుతుంది.. ఆమె అసలు ఆడదో, మగదో ఎవడికీ తెలియదు. ఎమ్మెల్యే నా కొడుకులంటే జగన్ కూడా దాని కొడుకేనా?. ఎమ్మెల్యే అంటే జగన్, చంద్రబాబు కూడా ఎమ్మెల్యేలే కదా. నా వయసెంత రోజా వయసెంత.. ఇలాంటి దురదృష్టకరమైన బూతులు. కొంతమంది కాపుల్ని ఉసిగొలిపి వాళ్లతోనే స్టేట్‌మెంట్స్. అంబటి రాంబాబు, పేర్ని నాని.. పనికిమాలినోళ్లంతా వచ్చి దమ్ముంటే అరెస్ట్ చేసుకోమంటున్నారు’ అని బొలిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేసారు.

జగన్‌ని “గజదొంగ”గా అభివర్ణించి, రాబోయే రోజుల్లో ఆయన అరెస్టు తప్పదని జోస్యం చెప్పారు. కొట్టు సత్యనారాయణ వంటి నాయకులు కూడా స్పందిస్తుండటం రాజకీయ దిగజారింపుకు ఉదాహరణగా నిలుస్తోంది. పరస్పర దూషణలు, వ్యక్తిగత విమర్శలు రాష్ట్ర రాజకీయాలలో సర్వసాధారణమవుతుండగా, ప్రజలు మాత్రం అసలు సమస్యలపై ఎవరూ మాట్లాడకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది