Janasena : మరోసారి బీజేపీ కోసం త్యాగంకు సిద్దం అయిన జనసేన
janasena : తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ కోసం త్యాగం చేసిన జనసేన పార్టీ మరోసారి తన త్యాగ గుణంను చాటుకుంది. ప్రస్తుతం తెలంగాణలో ఖమ్మం మరియు వరంగల్ కార్పోరేషన్ ల ఎన్నికలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఖమ్మం లో బలంగా ఉన్న జనసేన 12 డివిజన్లలో పోటీ చేసేందుకు సిద్దం అయినట్లుగా మొదట అధికారికంగా ప్రకటించింది. మొత్తం 12 డివిజన్లను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేయాలంటూ ఆ పార్టీ అధినాయకత్వం నాయకులకు సూచించింది. అయితే ఖమ్మంలో చివరికి జనసేన పోటీ చేసేది కేవలం 6 డివిజన్లే అని తేలిపోయింది. 12 డివిజన్లు అంటూ ప్రకటించిన మూడు రోజుల్లోనే సంఖ్య సగానికి తగ్గించుకుని 6 స్థానాలతో సరి పెట్టుకుంది.
janasena : బీజేపీ కోసం..
ఖమ్మంలో బీజేపీ నాయకత్వం కూడా బాగనే ఉంది. ఇలాంటి చోట ఆ పార్టీ కే ఎక్కువ స్థానాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుందనే నమ్మకంతో జనసేన ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే జనసేన పార్టీకి 12 మంది అభ్యర్థులు దొరక్క పోవడం వల్లే తప్పక ఆ స్థానాలను సైతం బీజేపీకి వదిలేసినట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. బీజేపీ నాయకత్వం తో చర్చలు జరిపిన తర్వాత 6 డివిజన్లకు జనసేన ఓకే చెప్పడం కాస్త ఆశ్చర్యంగా అనిపించిందని ప్రాంతీయ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో సారి పవన్ కళ్యాణ్ పార్టీ బీజేపీకి అనుకూల నిర్ణయం అయితే తీసుకుంది. కాని ఆ నిర్ణయం బీజేపీకి ఎంతగా ఉపయోగపడుతుంది అనేది చూడాలి.
janasena : తెలంగాణలో జనసేన…
తెలంగాణ లో జనసేన పార్టీ నాయకులు ప్రాభల్యం చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాని అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎక్కడ కూడా పోటీ చేయనివ్వడం లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు. హైదరాబాద్ లో 50 డివిజన్లలో పోటీ చేసి కనీసం 10 నుండి 15 అయినా గెలుచుకునే వాళ్లం కాని బీజేపీకి మద్దతు గా జనసేన పార్టీ ఎన్నికల నుండి తప్పుకుంది. ఇప్పుడు కూడా 12 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి చివరకు ఆరు స్థానాల్లోనే పోటీ చేయడం పట్ల కొందరు జనసేన పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.