Janasena : జనసేన మనసులోని మాటకి కార్యరూపం దాల్చబోతున్న చంద్రబాబు
ప్రధానాంశాలు:
Janasena : జనసేన మనసులోని మాటకి కార్యరూపం దాల్చబోతున్న చంద్రబాబు
Janasena : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్. అందుకే అన్ని విషయాలలో కూడా తగిన గుర్తింపు ఇస్తున్నారు చంద్రబాబు. మంత్రివర్గంలో నూ ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా జనసేన మనసులోని మాటను కార్యరూపంలో పట్టేందుకు సీఎం చంద్రబాబు దాదాపు అంగీకరించినట్టు తెలిసింది.

Janasena : జనసేన మనసులోని మాటకి కార్యరూపం దాల్చబోతున్న చంద్రబాబు
Janasena అమలు అవుతుందా ?Janasena : జనసేన మనసులోని మాటకి కార్యరూపం దాల్చబోతున్న చంద్రబాబు
2019 ఎన్నికల సమయంలో జనసేన అప్పట్లో కీలక హామీని ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే.. పేదలుతీసుకుంటున్న రేషన్‌కు.. బదులుగా తత్సమానమైన సొమ్మును వారి ఖాతాల్లో వేస్తామని.. తద్వారా రేషన్ తీసుకునే లబ్ధిదారులు. వారికి నచ్చిన బియ్యం.. ఇతర నిత్యావసరాలను కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని నాటి ఎన్నికల ప్రచారంలో పవన్ చెప్పుకొచ్చారు.
రేషన్ అక్రమాలకు చెక్ పెట్టాలని పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో చెబుతున్న విషయం తెలిసిందే. పైగా.. పౌర సరఫరాల శాఖకు కూడా జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలో తమ మనసులోని కోరికను తాజాగా సీఎం చంద్రబాబు ముందు పెట్టారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి.. నేరుగా వారికి సొమ్ములు ఇస్తే.. లబ్ధిదారులకు మేలు కలుగుతుంది. వారికినచ్చిన వస్తువులను వారే కొనుగోలు చేసుకుంటారు. దీనివల్లమాఫియాను అరికట్టడంతోపాటు పేదలకు కూడా నాణ్యమైన సరుకులు ఇచ్చినట్టు అవుతుంది అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిని చంద్రబాబు అమలు చేస్తారా లేదా చూడాలి.