Janasena : నెం.2 రాకతో జనసైనికుల విజయోత్సాహం.. ఇది దేనికి సంకేతం? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janasena : నెం.2 రాకతో జనసైనికుల విజయోత్సాహం.. ఇది దేనికి సంకేతం?

 Authored By himanshi | The Telugu News | Updated on :24 February 2021,9:52 pm

Janasena :  జనసేన పార్టీ పంచాయితీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించింది అంటూ ఆ పార్టీ నాయకులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అధికార పార్టీ వైకాపా మెజార్టీ పంచాయితీలను దక్కించుకుంది. సాదారణంగా పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం కామన్‌ గా జరుగుతుంది. ఇక్కడ కూడా వైకాపా భారీ విజయాలను సొంతం చేసుకుంది. మెజార్టీ స్థానాల్లో వైకాపా సర్పంచ్‌ లు కొలువుదీరారు. ఏపీలో వైకాపా పంచాయితీ జోరు ముందు తెలుగు దేశం పార్టీ నిలువలేక పోయింది. తెలుగు దేశం పార్టీ ముందస్తుగా మానిఫెస్టోను విడుదల చేయడంతో పాటు అనేక రకాలుగా ప్రచారాలు చేసినా కూడా ఆ పార్టీకి నిరాశ తప్పలేదు. ఇక వైకాపా ముందు బీజేపీ ముందు కూడా తేలిపోయింది. కొన్ని చోట్ల బీజేపీ మరియు జనసేన పొత్తు పెట్టుకుని ముందుకు నడిచింది. అయినా కూడా ఆ పార్టీకి పరాభవం తప్పలేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Janasena : జనసేన నెం.2 తో బాబు అవాక్కు…

జనసేన పార్టీ సర్పంచ్‌ అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలిచారు. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల్లో వైకాపా తర్వాత స్థానంను జనసైనికులు దక్కించుకున్నారు. ఈ రేంజ్‌ లో సర్పంచ్‌ లు గెలుస్తారని ఎవరు ఊహించలేదు. జనసేన పెద్ద ఎత్తున పంచాయితీ లను గెలుచుకున్న నేపథ్యంలో పార్టీ అధికారికంగా మస్త్‌ ఖుషీగా ఉంది అంటూ ఒక భారీ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. అందులో జనసేన మొత్తంగా 1209 మంది సర్పంచ్‌ లుగా గెలిచారు, 1576 మంది ఉప సర్పంచ్ లుగా గెలిచారు. ఇక 4456 మంది వార్డు మెంబర్స్ గా గెలవడంతో ఆ పార్టీ నాయకులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఉండగా, ప్రధాన పార్టీ అయిన బీజేపీ ఉండగా కూడా జనసేన నెం.2 గా నిలవడం ఆ పార్టీ నాయకులకు కూడా కాస్త ఆశ్చర్యంగానే ఉంది.

Janasena party has no chance to contest in tirupati by election

Janasena party has no chance to contest in tirupati by election

భారీ ఓటింగ్ తో జనసేన ఫుల్‌ హ్యాపీ..

2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జనసేనకు రక్త కన్నీరు మిగిల్చింది. కనీసం పవన్ పోటీ చేసిన స్థానాల్లో కూడా ఓటమి ని చవి చూడటం జరిగింది. జనసేన తరపున రాపాక తప్ప మరెవ్వరు గెలువలేదు. దాంతో జనసేన కార్యకర్తలు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. ఓటమిని మర్చి పోయి వెంటనే పవన్‌ కళ్యాణ్‌ జనాల్లో తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్ల ఫలితాలకు విభిన్నంగా సర్పంచ్‌ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి అంటూ టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి జనసేన సాధించిన విజయం ఆ పార్టీ నాయకులకు మరింత బూస్టింగ్‌ గా ఉంది.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది