Jr Ntr : నేడు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి అయినా అన్నగారు నందమూరి తారక రామారావు వారసుడిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేయడం ఖాయం, తాత స్థాపించిన తెలుగు దేశం పార్టీ ని ముందు ఉండి నడిపించడం ఖాయం అన్నట్లుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు ఎప్పటి నుండో ఆ సందర్బం కోసం వెయిట్ చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ కోసం గతంలో ఎన్టీఆర్ ప్రచారం చేయడం జరిగింది. కాని ఈమద్య కాలంలో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీకి దూరంగా ఉన్నాడు. అయినా కూడా ఆయన తెలుగు దేశం పార్టీకి చెందిన వ్యక్తే అనేది ఆ పార్టీ నాయకుల మాట. ఇక ఎన్టీఆర్ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు అనే ప్రశ్న వస్తూ ఉంటుంది…
ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమం ప్రకటన ప్రెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఆ సందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ షో తో ప్రేక్షకులకు మరింత చేరువ అవ్వబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఎన్టీఆర్ సమాధానం ఇచ్చాడు. ఆ సందర్బంగా మీ రాక కోసం అంతా ఎదురు చూస్తున్నారు. మీరు ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తారా అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఆ విషయమై మీ నుండి ఏమైనా స్పందన వస్తుందా అంటూ ప్రశ్నించగా ఎన్టీఆర్ నవ్వేసి ఈ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పండి. ఎప్పుడు నేను ఈ ప్రశ్నకు చెప్పే సమాధానమే ఇప్పుడు చెప్తాను. ఇది సమయం కాదు సందర్బం కాదు.. తర్వాత ఆ విషయమై సపరేట్ గా మాట్లాడేసుకుందాం అన్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు అడిగినా ఇదే సమాధానం చెబుతున్నాడు. కాని నాకు రాజకీయాలకు పడదు అని మాత్రం ఎప్పుడు చెప్పడం లేదు. కనుక భవిష్యత్తులో ఎన్టీఆర్ రాక కోసం ఖచ్చితంగా అభిమానులు ఎదురు చూడవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు రాజకీయ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ నుండి ఇప్పటి వరకు రాజకీయంగా స్పష్టమైన ప్రకటన మాత్రం రాలేదు. ఎన్టీఆర్ కు తెలుగు దేశం పార్టీపై ఆసక్తి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ కోసం ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు కాకున్నా కొన్నాళ్లకు అయినా ఎన్టీఆర్ అవసరం చంద్రబాబు నాయుడుకు రావడం పక్కా అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.