Jr Ntr : బిక్ బ్రేకింగ్‌.. రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jr Ntr : బిక్ బ్రేకింగ్‌.. రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్..!

Jr Ntr : నేడు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి అయినా అన్నగారు నందమూరి తారక రామారావు వారసుడిగా యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేయడం ఖాయం, తాత స్థాపించిన తెలుగు దేశం పార్టీ ని ముందు ఉండి నడిపించడం ఖాయం అన్నట్లుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు ఎప్పటి నుండో ఆ సందర్బం కోసం వెయిట్‌ చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ కోసం […]

 Authored By uday | The Telugu News | Updated on :13 March 2021,4:05 pm

Jr Ntr : నేడు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి అయినా అన్నగారు నందమూరి తారక రామారావు వారసుడిగా యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేయడం ఖాయం, తాత స్థాపించిన తెలుగు దేశం పార్టీ ని ముందు ఉండి నడిపించడం ఖాయం అన్నట్లుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు ఎప్పటి నుండో ఆ సందర్బం కోసం వెయిట్‌ చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ కోసం గతంలో ఎన్టీఆర్ ప్రచారం చేయడం జరిగింది. కాని ఈమద్య కాలంలో ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీకి దూరంగా ఉన్నాడు. అయినా కూడా ఆయన తెలుగు దేశం పార్టీకి చెందిన వ్యక్తే అనేది ఆ పార్టీ నాయకుల మాట. ఇక ఎన్టీఆర్ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు అనే ప్రశ్న వస్తూ ఉంటుంది…

ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమం ప్రకటన ప్రెస్ మీట్‌ లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఆ సందర్బంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ షో తో ప్రేక్షకులకు మరింత చేరువ అవ్వబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఎన్టీఆర్‌ సమాధానం ఇచ్చాడు. ఆ సందర్బంగా మీ రాక కోసం అంతా ఎదురు చూస్తున్నారు. మీరు ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తారా అంటూ అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఆ విషయమై మీ నుండి ఏమైనా స్పందన వస్తుందా అంటూ ప్రశ్నించగా ఎన్టీఆర్ నవ్వేసి ఈ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పండి. ఎప్పుడు నేను ఈ ప్రశ్నకు చెప్పే సమాధానమే ఇప్పుడు చెప్తాను. ఇది సమయం కాదు సందర్బం కాదు.. తర్వాత ఆ విషయమై సపరేట్ గా మాట్లాడేసుకుందాం అన్నాడు.

Jr Ntr Comments on Political entry in evaru meelo kotishwarulu

Jr Ntr Comments on Political entry in evaru meelo kotishwarulu

జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు అడిగినా ఇదే సమాధానం చెబుతున్నాడు. కాని నాకు రాజకీయాలకు పడదు అని మాత్రం ఎప్పుడు చెప్పడం లేదు. కనుక భవిష్యత్తులో ఎన్టీఆర్ రాక కోసం ఖచ్చితంగా అభిమానులు ఎదురు చూడవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు రాజకీయ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ నుండి ఇప్పటి వరకు రాజకీయంగా స్పష్టమైన ప్రకటన మాత్రం రాలేదు. ఎన్టీఆర్‌ కు తెలుగు దేశం పార్టీపై ఆసక్తి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్‌ కోసం ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు కాకున్నా కొన్నాళ్లకు అయినా ఎన్టీఆర్‌ అవసరం చంద్రబాబు నాయుడుకు రావడం పక్కా అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది