Jr NTR : చంద్రబాబు అరెస్టు పట్ల జూనియర్ ఎన్టీఆర్ స్పందన..!!

Advertisement

Jr NTR : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు కావటం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టు ని తెలుగుదేశం పార్టీ నేతలు ఖండిస్తున్నారు. సరిగ్గా ఎన్నికలు ముందు కావాలని రాజకీయ కక్షతో అక్రమంగా అరెస్టు చేయించారని వైసీపీ ప్రభుత్వం పై మండిపడుతున్నారు. ఇదే సమయంలో జాతీయ స్థాయి నాయకులు పలువురు సినీ సెలబ్రిటీలు సైతం చంద్రబాబు అరెస్టు విధానాన్ని తప్పు పడుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అయితే ఎలాంటి పరిస్థితులలో నందమూరి కుటుంబ సభ్యుడు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం సినీ, రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో దుబాయ్ లో సైమా అవార్డుల వేడుకకు ఎన్టీఆర్ వెళ్ళటం పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ అయితే ఎన్టీఆర్ అవార్డులు వేడుకకు వెళ్ళకూడదా అంటూ తారక్ అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు.

Advertisement
Jr ntr reaction to chandrababu arrest
Jr ntr reaction to chandrababu arrest

దీంతో సోషల్ మీడియాలో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అసలు ఎన్టీఆర్ ఎందుకు ఈ విషయంపై స్పందించడం లేదన్నది ఎవరికి అర్థం కావటం లేదు. అయితే మరోపక్క తన తండ్రి హరికృష్ణ అని చాలా దారుణంగా అవమానించడంతోనే.. అటు కల్యాణ్ రామ్ ఇటు ఎన్టీఆర్ ఎవరు కూడా చంద్రబాబు అరెస్ట్ లైట్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Advertisement
Advertisement