KCR VS Barrelakka Sirisha : నిన్ననే నాలుగు బర్లు కొన్న .. బర్రెలక్క మీద కేసీఆర్ పంచులు…వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR VS Barrelakka Sirisha : నిన్ననే నాలుగు బర్లు కొన్న .. బర్రెలక్క మీద కేసీఆర్ పంచులు…వీడియో !

KCR VS Barrelakka Sirisha : తెలంగాణ Telangana రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికలలో గెలవడానికి అన్ని పార్టీలు గట్టి పోటీని ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ BRS Party  మరోసారి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ BJP  బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీని ఇస్తున్నాయి. ఇక స్వతంత్ర అభ్యర్థిగా కొల్లాపూర్ నియోజక వర్గం kollapur assembly constituency లోని బర్రెలక్క Barrelakka Sirisha అసెంబ్లీ ఎన్నికలలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. […]

 Authored By anusha | The Telugu News | Updated on :26 November 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  KCR VS Barrelakka Sirisha : నిన్ననే నాలుగు బర్లు కొన్న ..

  •   బర్రెలక్క మీద కేసీఆర్ పంచులు...!

KCR VS Barrelakka Sirisha : తెలంగాణ Telangana రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికలలో గెలవడానికి అన్ని పార్టీలు గట్టి పోటీని ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ BRS Party  మరోసారి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ BJP  బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీని ఇస్తున్నాయి. ఇక స్వతంత్ర అభ్యర్థిగా కొల్లాపూర్ నియోజక వర్గం kollapur assembly constituency లోని బర్రెలక్క Barrelakka Sirisha అసెంబ్లీ ఎన్నికలలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. నాగర్ కర్నూల్ Nagarkurnool జిల్లాలోని పెద్ద కొత్తూరు మండలం మరికల్ గ్రామానికి చెందిన బర్రెలక్క అలియాస్ శిరీష కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

నిరుద్యోగం అంశమే ప్రధానంగా ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్క గతంలో ఉద్యోగం లేక గేదెలు కాస్తున్నానంటూ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆమె వైరల్ గా మారారు. అంతేకాకుండా ఆమెపై కేసు కూడా అయింది. దీంతో ఆమె ధైర్యం చేసి ఎన్నికలలో నిలబడ్డారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్నింటినీ ఎదుర్కొని బర్రెలక్క కొల్లాపూర్ నియోజక వర్గంలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా బర్రెలక్క మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగం, నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సు ఫ్రీ కోచింగ్, పేదలకు ఇండ్ల నిర్మాణం, ఉచిత విద్య వైద్య సదుపాయాలను అందిస్తామని మేనిఫెస్టోలో ఉంది.

ఇక తాజాగా కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ .. టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. పదేళ్ల ముందు తెలంగాణ ఎట్లుండేది ఇప్పుడు ఎలా ఉంది ఒకప్పుడు కరెంటు కోత, మంచినీళ్ల తిప్పలు, చేనేత కార్మికుల, రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ జరిగేవి కానీ తెలంగాణ వచ్చాక మొట్టమొదటిగా 24 గంటల కరెంటు, పెన్షన్ ఇస్తున్నాం, ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరు నిలబడతారు. ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తుంటారు. వాళ్ళు ఏదో చెప్పారని మీరు ఆగం కాకండి తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. అవి ఓట్లు కాదు తెలంగాణ బ్రతుకుతెరువు పోరాటం అని ఆయన చెప్పుకొచ్చారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది