Student : 500 గ్రాములతో పుట్టిన ఈ అమ్మాయి.. ఇప్పుడు అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్ కొట్టేసింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Student : 500 గ్రాములతో పుట్టిన ఈ అమ్మాయి.. ఇప్పుడు అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్ కొట్టేసింది..!

Student : పిల్లలకు స్కూల్ తప్పించడం అంటే ఎంతో ఇష్టం. ఏవో కారణాలు చెప్పి స్కూల్ కి డుమ్మా కొట్టేద్దామని చూస్తారు. ఆరోగ్యం బాగున్నా సరే కాలు నొప్పి, కడుపునొప్పి అని చెప్పి స్కూల్ కి ఎగనామం పెడతారు. అయితే ఒక అమ్మాయి మాత్రం స్కూలుకు హాజరయ్యే విషయంలో రికార్డ్ లను ఏర్పరచింది. ఇంతకీ ఎవరా అమ్మాయి ఏంటా కథ అన్నది చూస్తే. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మస్తాన్ వలీ కార్డ్ డ్రైవర్ గా చేస్తుంటాడు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 August 2024,7:10 pm

ప్రధానాంశాలు:

  •  Student : 500 గ్రాములతో పుట్టిన ఈ అమ్మాయి.. ఇప్పుడు అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్ కొట్టేసింది..!

Student : పిల్లలకు స్కూల్ తప్పించడం అంటే ఎంతో ఇష్టం. ఏవో కారణాలు చెప్పి స్కూల్ కి డుమ్మా కొట్టేద్దామని చూస్తారు. ఆరోగ్యం బాగున్నా సరే కాలు నొప్పి, కడుపునొప్పి అని చెప్పి స్కూల్ కి ఎగనామం పెడతారు. అయితే ఒక అమ్మాయి మాత్రం స్కూలుకు హాజరయ్యే విషయంలో రికార్డ్ లను ఏర్పరచింది. ఇంతకీ ఎవరా అమ్మాయి ఏంటా కథ అన్నది చూస్తే. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మస్తాన్ వలీ కార్డ్ డ్రైవర్ గా చేస్తుంటాడు. అతను కేరళకు చెందిన షీభాను పెళ్లి చేసుకున్నాడు. 2017 లో ఈ ఇద్దరి దంపతులకు ఒక పాప జన్మనించ్చింది. ఐతే ఆమె పేరు అయత్ ఇశ్రాయెల్ జిబ్రిల్ అని పేరు పెటారు. పాప పుట్టే టైం కు ఐదున్నర నెలలే కావడంతో ఆమెను మూడున్నర ఏళ్ల దాకా ఒక ప్రత్యేకమైన రూంలోనే ఉంచారట.

Student ఒక్కరోజు కూడా స్కూల్ బంక్ కొట్టకుండా రికార్డ్..

అంతేకాదు పుట్టినప్పుడు ఆమె బరువు కేవలం 500 గ్రాములే ఉందట. అయినా సరే పాపను కటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారట. అందుకోసం వారికి దాదాపు పాతిక లక్షల దాకా ఖర్చు అయినట్టు తెలుస్తుంది.ఆరోగ్యం కుదుట పడ్డాక ఆ పాపకు ఐదేళ్లు రాగానే కేరళలోని ఒక స్కూల్ లో ఎల్.కె.జి లో జాయిన్ చేయించారట. స్కూల్ లో నిత్యం మాస్క్ ధరించి ఉంటూ ఆ పాప శానిటైగర్ కూడా వేసుకుని చేతులు కడుక్కుంటుందట. ఇతర విద్యార్ధులకు దూరంగా కూర్చుకుంటుందట. ఇప్పుడు ఆ పాప వయసు 7 ఏళ్లు.

Student 500 గ్రాములతో పుట్టిన ఈ అమ్మాయి ఇప్పుడు అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్ కొట్టేసింది

Student : 500 గ్రాములతో పుట్టిన ఈ అమ్మాయి.. ఇప్పుడు అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్ కొట్టేసింది..!

ఐతే 2023-24 లో 197 రోజూ క్లాసులు జరగగా అన్ని రోజులూ స్కూల్ కు హాజరైంది ఆ పాప. ఒక్కరోజు కూడా స్కూల్ మానకుండా వెళ్లినందుకు ఆమెకు అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకె ఇంకా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. స్కూల్ కి తప్పించాలనుకునే వారికి ఈ పాపని చూసైనా స్పూర్తి పొంది క్రమం తప్పకుండా స్కూల్ కి వెళ్తారేమో చూడాలి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది