Kodali Nani : నందమూరి ఫ్యామిలీలో బాలయ్య పిచ్చోడు.. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే దమ్మున్న మగాడురా.. కొడాలి సినిమా స్టైల్ వార్నింగ్ అదుర్స్
Kodali Nani : కొడాలి నాని గురించి తెలుసు కదా. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఒక ఫైర్ బ్రాండ్. గుడివాడలో కొడాలికి మామూలు క్రేజ్ లేదు. ఆయన చంద్రబాబు గురించి, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గురించి ఓ రేంజ్ లో ఫైర్ అవుతాడు. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ గురించి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరితో ఉంటాడో ఎవరితో కలిసి పోటీ చేస్తాడో.. ఎప్పుడు ఎవరితో ఉంటాడో ఆయనకే తెలియదు. ఆయన ఎన్డీఏలో ఉన్నాడో లేదో మాకు ఎలా తెలుస్తుంది. ఆయనే చెప్పాడు కదా.. నేను ఎన్డీఏతో కలిసి లేను. టీడీపీతో కలిసి ఉన్నానని. బీజేపీ వాళ్లు ఏమో టీడీపీతో కలవం అంటున్నారు. ఈయన ఎన్డీఏలో ఉన్నట్టా.. లేనట్టా.. అనేది స్పష్టం కావడం లేదు.
టీడీపీతో కలిసి పోటీ చేసేది లేదని ఎన్డీఏనే స్పష్టం చేసింది కదా. అసలు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు పవన్ కళ్యాణ్. జనసేన పోటీ చేసిన నియోజకవర్గాల్లో దాదాపు 130కి పైగా నియోజకవర్గాల్లో డిపాజిట్లే రాలేదు. అయినా ఎగిరి ఎగిరి పడుతున్నాడు పవన్ కళ్యాణ్. మాకు 151 సీట్లు వచ్చాయి. మరి మేమెంత ఎగిరిపడాలి. జగన్ ఏం పీకలేడు అని అన్నారు కదా.. ఇప్పుడు జగన్ ఏం పీకారో అందరికీ తెలుసు కదా. అరిచే కుక్క కరవదు.. కరిచే కుక్క అరవదు.. ఇప్పుడు అరిచే కుక్క ఎవరో.. కరిచే కుక్క ఎవరో కూడా అందరికీ తెలుసు. ఆయన పావలా కళ్యాణ్.. మేము రూపాయి.. రూపాయి పావలా అంటే మాకు 125 సీట్లు వస్తాయని చెబుతున్నాడు. ఆయనేమో పావలా కళ్యాణ్. అంటే.. 25 సీట్లు అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు.
Kodali Nani : ఈ దొంగను పట్టుకోవడానికి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలా?
చంద్రబాబు, భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేష్ వీళ్లందరినీ చూస్తున్నాం. వీళ్లందరూ కలిసినా ఏం జరగదు. చంద్రబాబు అవినీతి అక్రమాల పుట్ట. అతడు అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన తర్వాత రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం విరుద్ధమట. గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదట. చంద్రబాబు తరుపున వచ్చిన లాయర్లు కూడా అదే వాదిస్తున్నారు. చంద్రబాబు తప్పు చేశాడు. కాకపోతే ఈ దొంగను పట్టుకోవడానికి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అని వాదిస్తున్నారు. ఇది 2017 లో జరిగిన కార్యక్రమం. 18లోనే కేసు ఎఫ్ఐఆర్ జరిగింది. దాంట్లోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆయన్ను స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కావచ్చు.. ఇంకో స్కామ్ కావచ్చు. ఖచ్చితంగా చంద్రబాబు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే.. అంటూ కొడాలి మండిపడ్డారు.