Kodali Nani : మరోసారి చంద్రబాబు పై మండిపడ్డ కొడాలి నాని .. నువ్వు జగన్ ని ఏం పీకలేవు అంటూ కామెంట్స్ ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kodali Nani : మరోసారి చంద్రబాబు పై మండిపడ్డ కొడాలి నాని .. నువ్వు జగన్ ని ఏం పీకలేవు అంటూ కామెంట్స్ ..!!

 Authored By anusha | The Telugu News | Updated on :10 December 2023,5:30 pm

ప్రధానాంశాలు:

  •  Kodali Nani : మరోసారి చంద్రబాబు పై మండిపడ్డ కొడాలి నాని ..

  •  నువ్వు జగన్ ని ఏం పీకలేవు అంటూ కామెంట్స్ ..!!

Kodali Nani : మరో రెండు, మూడు నెలల్లోనే ఏపీలో ఎన్నికల జరగనున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు పాదయాత్రతో జనాలలోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు.ఇక అధికార పార్టీ వైయస్సార్ సిపి పార్టీపై గెలిచి తాము అధికారంలోకి రావాలని తెలుగుదేశం, జనసేన గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. తాము అధికారంలోకి రావాలని తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక మొదటి నుంచి తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తూ వస్తున్న వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు కొడాలి నాని తాజాగా మరోసారి తెలుగుదేశం జనసేన పార్టీ పై విమర్శలు గుప్పించారు. ఆగి ఉన్న లారీ కింద దూరిన కుక్క ఆ లారీని తానే మోస్తున్నానని అనుకుంటుందని, లారీ కింద దూరిన కుక్కకి టిడిపి నేతలకు తేడా లేదంటూ మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ. రేవంత్ రెడ్డిని వీళ్ళే సీఎం చేసినట్లు ఫీలవుతున్నారని, సిగ్గు లేకుండా గాంధీభవంలో టిడిపి జెండాలు పట్టుకొని ఫుల్లుగా త్రాగి గంతులు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కూడా చంద్రబాబు శిష్యుడే కదా ఒక శిష్యుడు దిగిపోయి మరొక శిష్యుడు పదవిలోకి వచ్చాడని అన్నారు. తన శిష్యులు సీఎంలు అవుతున్నారని చంద్రబాబు ఎక్కివెక్కి ఏడుస్తున్నాడని ఎగతాళి చేశారు. చంద్రబాబు ప్రజలను పట్టించుకోకుండా హెరిటేజ్, ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే పట్టించుకున్నాడని ఫైరయ్యారు. కోటానుకోట్లు దోచుకున్నాడు కాబట్టి చంద్రబాబు వంటి పనికిరాని వాడిని గత ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారని కొడాలి నాని గుర్తు చేశారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి పై వ్యతిరేకత ఉంటుందా లేక చంద్రబాబు దొంగ 420 అయినందుకు అనుకూలత ఉంటుందా అని ప్రశ్నించారు.

చంద్రబాబు అధికారంలోకి రావడం అసలు జరగని పని అని, అది ఒక పగటి కల అని ఆయన అన్నారు. ఇక జనసేన పార్టీ తెలంగాణలో బిజెపితో కలిసి పోటీ చేస్తే వాళ్ల పరిస్థితి ఏమైందో మనం చూసామని, ఏపీలో చంద్రబాబుతో కలిసి జనసేన పోటీ చేస్తే తెలంగాణలో జరిగినట్లుగానే అవుతుందని కొడాలి నాని అన్నారు. ప్రతిపక్షం కోసమే చంద్రబాబు అసెంబ్లీలో అధ్యక్ష అనడం కోసం పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. గుడివాడ వైఎస్సార్సీపీ కి కంచుకోట అని, త్రాను బ్రతికే ఉండగా గుడివాడ నియోజకవర్గంలో వైయస్సార్సీపీ జెండా దించడం ఎవరివల్లా కాదు అని కొడాలి నాని అన్నారు. ఇకపోతే ఏపీలో ఈసారి జగన్ గెలుస్తారా లేక చంద్రబాబు గెలుస్తారా అని ఉత్కంఠత పెరిగింది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది